RCB CSK Jersey : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సూపర్ విక్టరీ సాధించింది. ఒకే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలు కావడం ఇదే మొదటి సారి. ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాలు సాధిస్తుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలవుతుంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మొదటి స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానంలో ఉండటం గమనార్హం.
Also Read : Jadeja Boundary: బౌండరీ ఆపేసిన అంపైర్ నితిన్… గొడవ పెట్టుకున్న జడేజా !
నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కేవలం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగులు భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొన్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బౌలర్లకు చుక్కలు చూపిస్తే.. ఈ మ్యాచ్‌లో 17 ఏళ్ల ఆయుష్ మాత్రే సూపర్ బ్యాటింగ్ చేశాడు. 48 బంతుల్లో 94 (9 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులు సాధించి తన సత్తా చాటాడు. మరోవైపు జడేజా కూడా తన వంతు పార్ట్‌నర్షిప్ అందించాడు. 45 బంతుల్లో 77 (8 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు సాధించి.. చివరి వరకూ పోరాడాడు. ఇక లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోగా.. మ్యాచ్ మధ్యలో అంపైర్ల తీరును క్రికెట్ అభిమానులు తప్పుపట్టారు. అంతేకాకుండా.. మ్యాచ్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయుష్ మాత్రే, జడేజా క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ చెన్నైదే అని అందరూ అనుకున్నారు. 17వ ఓవర్లో రెండో బంతికి ఆయుష్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ (Dewald Brevis) మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా(LBW) ఔటయ్యాడు. నిజానికి ఇది నాటౌట్ అని.. వికెట్స్ మిస్సవుతున్నట్లు ఆ తర్వాత రివ్యూలో తేలింది. కానీ.. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. డెవాల్డ్ బ్రేవిస్ ఔటని అంపైర్ డిక్లేర్ చేశాకా.. బ్రేవిస్ జడేజా వద్దకు వెళ్లి రివ్యూ తీసుకోవాలా వద్దా అని డిస్కస్ చేస్తున్నాడు. ఇక రివ్యూ కోరగా.. అంపైర్ దానికి అంగీకరించలేదు. జడేజా కాసేపు అంపైర్‌తో వాగ్వాదానికి దిగినా.. ప్రయోజనం లేకపోయింది. ఇక బ్రేవిస్ వెనుదిరగక తప్పలేదు. బిగ్ స్క్రీన్‌పై LBW రివ్యూ చూపించగా.. స్టంప్స్ మిస్సయినట్లు క్లియర్‌గా కనిపించింది. అయితే.. బ్రేవిస్ ఔటై.. రివ్యూ కోసం అడిగినప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించే 15 సెకెంక్స్ డీఆర్‌ఎస్ టైమర్ కనిపించలేదని.. దీంతో బ్రేవిస్ రివ్యూ తీసుకునే టైమ్‌లో కన్ఫ్యూజ్ అయినట్లు క్లియర్‌గా కనిపిస్తుందని నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓవీడియో వైరల్ అవుతోంది. ఆర్సీబీ-CSK ఒక్కటయ్యాయని నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక రెండు జట్లు ఒకే కలర్ జెర్సీలు వేసుకున్నాయని ఓ వీడియో వైరల్ కావడం విశేషం.