Big Stories

Indians : ఆర్థిక అభద్రతలో భారతీయులు..

Indians : దేశంలో కొవిడ్ తర్వాత చాలా మంది ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. ఉద్యోగాలు ఊడిపోవడం, ఉపాధి దొరక్కపోవడం… పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో అన్ని నిత్యావసరాల ధరలూ పెరిగిపోవడం వంటి పరిణామాలతో… దిగువ మధ్యతరగతి, పేద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో సర్వే చేసిన ఓ సంస్థ… మెజారిటీ ప్రజల్లో అభద్రతా భావం ఉందని వెల్లడించింది.

- Advertisement -

దేశంలో 69 శాతం మంది ఆర్థిక అభద్రతా భావంతో బతుకుతున్నారని… మనీ 9 అనే సర్వే సంస్థ తేల్చింది. భారతీయ కుటుంబాల్లో 4.2 శాతం కుటుంబాల సగటు ఆదాయం నెలకు రూ.23,00 మాత్రమే అని… 46 శాతం కుటుంబాల వాస్తవిక ఆదాయం నెలకు రూ.15,000 కంటే తక్కువే ఉందని సర్వేలో తేలింది. జీవన పమ్రాణాల పరంగా దేశంలో కేవలం 3 శాతం కుటుంబాలే ఉన్నత విభాగంలో ఉన్నాయని తెలిపింది. వీటిల్లో అధిక భాగం ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందిన కుటుంబాలే అని సర్వే నివేదిక వెల్లడించింది.

- Advertisement -

దేశంలో 70 శాతం కుటుంబాలకు బ్యాంకు డిపాజిట్లు, బీమా, పోస్టాఫీస్ పొదుపు, బంగారం రూపంలో పెట్టుబడులు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. 64 శాతం కుటుంబాలు బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడులు కలిగి ఉంటే, 19 శాతం కుటుంబాలు జీవిత బీమా రూపంలో పెట్టుబడులు పెట్టాయి. ఇక 40 శాతం కుటుంబాలకు అసలు ఆర్థిక పొదుపే లేవు. 22 శాతం కుటుంబాలకు స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్, యులిప్స్, భౌతిక ఆస్తుల్లో పెట్టుబడులు ఉండగా… ప్రాపర్టీలు/భూములపై అత్యధికంగా 18 శాతం, మ్యూచువల్‌ ఫండ్స్‌లో 6 శాతం, స్టాక్స్‌లో 3 శాతం, యులిప్‌లలో 3 శాతం మంది ఇన్వెస్ట్ చేశారు. 11 శాతం కుటుంబాలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు తీసుకున్నాయని… వీటిల్లో వ్యక్తిగత రుణాలు ఎక్కువ కాగా, ఆ తర్వాతి స్థానం గృహ రుణాలదేనని మనీ 9 సర్వే బయటపెట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News