Big Stories

Central Government : కేంద్రం ఆగ్రహం.. మస్క్ యూ టర్న్..

- Advertisement -

Central Government : సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ట్విట్టర్ నుంచి ఏకంగా 50 శాతం మంది ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్… భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్లోనూ 90 శాతం మందికి పైగా తొలగించాడు. ఇప్పుడు దేశంలో ట్విట్టర్ కు కేవలం డజను మంది సిబ్బంది మాత్రమే మిగిలారని ట్విట్టర్ వర్గాలు చెబుతున్నాయి. 100కు పైగా భాషలున్న భారత్‌లో, కేవలం 12 మంది సిబ్బందితో మస్క్ ఎలా సంస్థను నడుపుతాడో చూడాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు… సంస్థలో ప్రస్తుత పరిస్థితిని తెలపడానికి అవమానం, అనిశ్చితి అనేవి సరైన పదాలంటూ… పింక్‌ స్లిప్‌ అందుకున్న ట్విట్టర్‌ ఇండియా సిబ్బంది ఒకరు వ్యాఖ్యానించారు.

- Advertisement -

ట్విట్టర్ నుంచి ఉద్యోగుల్ని తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ట్విటర్‌ ఉద్యోగుల అకస్మిక తొలగింపు సరైంది కాదంటూ… మస్క్ తీరును కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తప్పుబట్టారు. తొలగించాలని భావించినవారికి, మరో ఉద్యోగంలో మారేందుకు సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు… సంచలన నిర్ణయాలతో అనేక ట్విస్టులిస్తున్న ఎలాన్ మస్క్… ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు విషయంలో మరో ట్విస్ట్ ఇచ్చారు. తీసేసిన వారిలో కొందరికి… మళ్లీ విధుల్లో చేరాలంటూ మెయిల్స్ పంపుతున్నారు. కొత్త ఫీచర్లు రూపొందించాలన్నా, సర్వీసులు అందించాలన్నా… అనుభవమున్న ఉద్యోగులు అవసరం కావడంతో… మళ్లీ విధుల్లో చేరాల్సిందిగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో సంస్థ సంప్రదింపులు చేస్తోందని… బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ట్విటర్‌ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌లోని ఉద్యోగులతో సహా 50 శాతం మంది సిబ్బందిపై ఇటీవలే ట్విట్టర్ వేటు వేసింది. వీటిలో కమ్యూనికేషన్స్, కంటెంట్ క్యూరేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ ఎథిక్స్‌కు బాధ్యత వహించే టీమ్‌లతో పాటు ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్ టీమ్‌లు ఉన్నాయి. ఈ టీమ్ ల్లో ఏయే విభాగాల వారితో ట్విట్టర్ ఇప్పుడు సంప్రదింపులు జరుపుతోందో ఇంకా బయటికి రాలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News