Rahul-Tejaswi Yadav: ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ నేతలు, ఫిల్మ్ సెలబ్రిటీలు వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అఫ్ కోర్సు.. కారణాలు ఏమైనా కావచ్చు. లైఫ్‌లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వివాహం చేసుకోవాలని యువతీ యువకులు ఆలోచిస్తున్న రోజులు ఇవి.
ఈ విషయంలో తాము తీసిపోమని అంటున్నారు కొందరు రాజకీయ, సినీ సెలబ్రిటీలు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ-తేజస్వియాదవ్ మధ్య పెళ్లిళ్ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసలే మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేస్తున్నారు. ఇందులో భాగంగా అరారియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడారు. ఎల్‌జీపీ నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌పై విమర్శలు గుప్పించారు తేజస్వి. కొంతమంది హనుమంతుడిగా భావించుకుంటున్నారని, మనం ‘ప్రజల హనుమంతులం’ అని అన్నారు.
చిరాగ్ త్వరగా పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు తేజస్వి. పక్కనేవున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మైక్ అందుకున్నారు. ఈవిషయంలో నోరు విప్పారు. ఈ మేటర్ తనకు వర్తిస్తుందన్నారు. ఈ సరదా సంభాషణతో ఇద్దరు నేతలు హాయిగా నవ్వుకోవడం ఆ స్టేజిపై కనిపించింది.
ALSO READ: రాహుల్ గాంధీ యాత్రలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్
ఈ విషయాన్ని మా నాన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటినుంచో చెబుతున్నారని తేజస్వీ బదులిచ్చారు. అది నిజమేనని, దీనిపై ఆయనతో చర్చలు కొనసాగుతున్నాయని రాహుల్‌గాంధీ బదులిచ్చారు. ఈ సరదా సంభాషణ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. రెండేళ్ల కిందట పట్నాలో రాహుల్ గాంధీ పెళ్లిపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో నవ్వులు పూయించారు.
‘మా మాట విను.. పెళ్లి చేసుకో. మేమంతా నీ బరాత్‌కు రావాలనుకుంటున్నాం.. వివాహానికి విముఖత చూపుతుండటంతో మీ అమ్మ (సోనియా గాంధీ) ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు లాలూ. తాజాగా తేజస్వితో సమావేశంలో ఇదే విషయాన్ని రాహుల్ ప్రస్తావనకు తీసుకొచ్చారని అంటున్నారు.
ఉన్నట్లుండి చిరాగ్ పెళ్లి విషయంలో రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవడంతో ఎల్జేపీ అధినేత ఇండియా కూటమి టచ్‌లోకి వెళ్లారా? అన్న అనుమానం ఇప్పుడే బీజేపీలో మొదలైంది. దీనిపై బీహార్‌లో రకరకాల చర్చలు పెట్టుకుంటున్నారు పలు రాజకీయ పార్టీల నేతలు.
#RahulGandhiMarriage : बिहार: तेजस्वी यादव ने चिराग पासवान पर तंज कसते हुए कहा कि कुछ लोग 'विशेष व्यक्ति के हनुमान' हैं, लेकिन हमलोग 'जनता के हनुमान' हैं। इसके अलावा तेजस्वी ने चिराग को जल्द से जल्द शादी करने की सलाह दी। फिर राहुल गांधी ने कहा कि ये तो मुझ पर भी लागू होता है। फिर… pic.twitter.com/jQHfeGHYza
— Moneycontrol Hindi (@MoneycontrolH) August 24, 2025