BigTV English

Ayodhya Terror Attack : అయోధ్యపై ఉగ్ర కుట్రలు – పాక్ ఐఎస్ఐ పాత్రపై సంచలన విషయాలు

Ayodhya Terror Attack : అయోధ్యపై ఉగ్ర కుట్రలు – పాక్ ఐఎస్ఐ పాత్రపై సంచలన విషయాలు

Ayodhya Terror Attack : భారతీయుల ఆరాధ్యదైవం అయోధ్య రామయ్య దేవాలయంపై దాడులు చేసేందుకు పన్నాగం పట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదిని గుజరాత్, హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబ్దుల్ రెహమాన్ (19)గా గుర్తించిన పోలీసులు.. ఇతనిది ఉత్తర్ ప్రదేశ్ గా గుర్తించారు. చదువును మధ్యలోనే మానేసిన ఈ యువకుడు.. ప్రమాదకర ఇస్లాం ఉగ్రవాదానికి ఆకర్షితుడైయ్యాడు. అందులో భాగంగానే.. కోట్ల మంది హిందువుల పవిత్ర స్థలమైన అయోధ్య ఆలయాన్ని బాంబులతో పేల్చేయాలని, అక్కడ విధ్వంసం చేయాలని పన్నాగాలు పన్నాడు. ఇందుకోసం.. రెండు హ్యాండ్ గ్రెనేడ్ లను పేల్చాలని ప్లాన్ చేయగా.. నిఘా వర్గాల సమాచారంతో ఇతని కుట్రల్ని భగ్నం చేసారు.


ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామాలయాన్ని టార్గెట్ గా అనేక ఇస్లాం ఉగ్రవాదులు కుట్రలు రచిస్తుండగా.. వాటిలో ఓ కేసులో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు హ్యాండ్ గ్రానెట్లను సైతం గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని యుపీలోని ఫైజాబాద్‌కు చెందిన అబ్దుల్ రెహమాన్ (19) గా గుర్తించారు. ఇతను మాంసం దుకాణం నడుపుతూ, ఆటో రిక్షా నడిపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇతడిని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ -ISI సహాయం చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. హరియాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేసి.. స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఇతనికి 10 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

దేశంలో మత గొడవలు సృష్టించడం, హిందువుల టార్గెట్ గా బలమైన దాడులు చేయాలని ప్రయత్నిస్తున్న ఐఎస్ఐ.. ఈ దాడికి ప్రణాళికలు రచించింది. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నిఘా వర్గాలు.. ఇస్లామిస్టుల కార్యకలాపాలు, వారి ఉగ్ర ఆలోచనలకు ప్రభావితం అవుతున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆ సమయంలోనే అబ్దుల్ రెహమాన్ పోలీసులకు చిక్కాడు. ఈ యువకుడు.. అనేక జమాత్‌లు, ఇస్లామిక్ సమావేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


గత సంవత్సరం జనవరి 22న అయోధ్యలో ప్రతిష్టించిన రామాలయాన్ని పడగొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రమూకలు.. ఎదో రకంగా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అబ్దుల్ రెహమాన్ సైతం.. ప్రాణప్రతిష్ట రోజు.. గుడి చుట్టూ అనేక రౌండ్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ మిషన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని ISI తో పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి. హరియాణాలోని ఫరీదాబాద్‌లో తన హ్యాండ్లర్‌ను కలుసుకుని రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకోవాలని రెహమాన్ ప్లాన్ చేసుకున్నాడు. వాటిని రైలులో పెట్టుకుని అయోధ్యకు తీసుకెళ్లాలని, అక్కడ పేల్చేయాలని భావించిట్లుగా చెబుతుంటారు. అయితే, కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా హరియాణా ఎస్‌టిఎఫ్, గుజరాత్‌లోని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ బృందం వెంటనే చర్య తీసుకుని అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నాయి. రెండు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నిందితుడిపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు సంస్థలు.. ఫరీదాబాద్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న పాలి గ్రామం సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లో… పాక్ ఉగ్రమూకలు అందించిన రెండు హ్యాండ్ గ్రెనైట్లను దాచినట్లు గుర్తించారు. ఈ రెండింటిని స్వాధీనం చేసుకుని, భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. అతనిపై అందిన సమాచారాన్ని నిర్థరించుకుని.. ATS బృందం అతన్ని గుజరాత్‌కు తీసుకెళ్లింది, అక్కడ అతన్ని విచారించనున్నారు. ఈ కేసులో ATS ఆపరేషన్ కొనసాగుతోందని, ఇంకా చురుగ్గా ఉన్న ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదమూలాలు ఇంకా ఉండవచ్చని భద్రతా వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో నిందితుడి గ్రామంలో పోలీసులు విస్తృత సోధాలు నిర్వహిస్తున్నారు. మూడు బృందాలుగా యూపీలోని బలియాలో సోదాలు నిర్వహిస్తున్నారు.

అయోధ్య రామాలయంపై బాంబు పేళుల్ల కుట్రలో గుర్తు తెలియని పాకిస్తానీ మహిళా ఐఎస్ఐ కార్యకర్తకు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మారుపేరు ఇషికా కపూర్ అని భావిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. యుపిలోని బలియా జిల్లాలోని బోడియా గ్రామంలో నివసించే రాహుల్ సింగ్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని, అతనిని ప్రశ్నిస్తున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×