నక్కలు.. చిన్నప్పటి నుంచి వీటి గురించి కథలు, కథలుగా వింటుంటాం. తాతయ్యలు మొదలుకొని స్కూల్లో టీచర్ల వరకు నక్కల గురించి ఎన్నో కథలు చెప్పి ఉంటారు. అడవిలోని జంతువులలో అత్యంత తెలివైన జంతువుగా నక్కలకు పేరుంది. అడవికి రాజైన సింహంతో దోస్తీ చేయడం దగ్గరి నుంచి, జిత్తుల మారి వేషాలతో ఎదుటి జంతువులను చిత్తు చేసే వరకు ఎన్నో రకాల కథలు చదువుకుని ఉంటాం. ఎన్ని కథలైనా సారాంశం ఒకటే. నక్కలు చాలా తెలివైన జంతువులు. తమ సమయ స్ఫూర్తితో అపాయం నుంచి ఈజీగా బయటపడగలవు. కానీ, కథలు వేరు.. వాస్తవాలు వేరు. పుస్తకాల్లో తెలివైన జంతువులుగా గుర్తింపు పొందిన నక్కలు.. వాస్తవ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి? అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రాణాలు ఎలా కోల్పోయాయి?ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మొసళ్లు నిండిన నదిని దాటబోతూ..
మొత్తం 8 నక్కలు.. నది ఇటు ఒడ్డు నుంచి అటు ఒడ్డుకు చేరుకోవాలి అనుకున్నాయి. కాసేపు ఆలోచించాయి. మొత్తంగా 8 నక్కలు ఒకేసారి నది దాటాలని ప్లాన్ చేశాయి. వీటిలో ఓ నక్క ముందుగా బయల్దేరింది. ఆ నక్కను ఫాలో అవుతూ మిగతా నక్కలు నదిని ఈదుతూ వెళ్లాయి. నదిని దాటాలనే ఆలోచన బాగానే ఉన్నా, నీళ్లలో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాయి నక్కలు. ఆ నదిలో బోలెడన్ని మొసళ్లు ఉన్నాయి. ఆ విషయాన్ని నక్కలు తెలుసుకోలేకపోయాయి. సగానికి వెళ్లగానే ఓ మొసలి వచ్చి వెనుకున్న7 నక్కలలో ఒకదాన్ని పట్టుకుంది. అయినప్పటికీ, మిగతా నక్కలు ముందుకు అలాగే కదిలాయి. మరికొంత దూరం వెళ్లగానే మరో మొసలి దూసుకొచ్చి ఇంకో నక్కను పట్టేసింది. ఆ భయంతో మూడు నక్కలు వెనక్కి పరిగెత్తాయి. మరో మూడు నక్కలు నది దాటి ముందుకు వెళ్లాయి.
Read Also: ఈ పిల్లాడివి ‘ఊసరవెల్లి’ కళ్లు.. రంగులు ఎలా మారుతున్నాయో చూడండి!
Eight African wild dogs cross a crocodile infested river. How many make it to the other side? 😭🔞 pic.twitter.com/5zP1akF6hC
— Kgoshi Ya Lebowa (@Mothematiks) February 27, 2025
Read Also: ఆకాశం నుంచి వింత శబ్దాలు.. భయంతో పరుగులు తీసిన జనాలు!
భయంతో వణికిపోయిన నక్కలు
చూస్తుండగానే తమ జట్టులోని రెండు నక్కలను మొసళ్లు పట్టి ప్రాణాలు తీయడంతో మిగతా నక్కలు భయంతో వణికిపోయాయి. తమ ప్రాణాలు ఎక్కడ పోతాయోననే భయంతో భయాందోళనకు గురయ్యాయి. ప్రాణాలతో బయటపడితే చాలు దేవుడా అనుకున్నాయి. వెంటనే, వెనక్కి మళ్లీ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చాయి. ఒడ్డుకు చేరుకున్నా, భయం మాత్రం అలాగే ఉండిపోయింది. మిగతా మూడు నక్కలు నది దాటి వెళ్లిపోయాయి. కళ్ల ముందే తమ తోటి నక్కల ప్రాణాలు కోల్పోవడంతో ఒడ్డుకు చేరిన నక్కలు వణుకుతూ కనిపించాయి. ఈ వీడియో క్గోషి యా లెబోవా అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్లిప్ చూస్తుంటే, కథల్లో చెప్పినట్లు నక్కలు అంత తెలివైన జంతువులు ఏమీ కాదని అర్థం అవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: బట్టతల ఉందని బాధపడుతున్నారా? అయితే, మీకు షఫీక్ గురించి తెలియాల్సిందే!