BigTV English

Low Price Mobile: చౌక ధరలో రేస్ గుర్రం వచ్చేసింది.. 108MP కెమెరా, 8GB RAM, 5030mAh బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్!

Low Price Mobile: చౌక ధరలో రేస్ గుర్రం వచ్చేసింది.. 108MP కెమెరా, 8GB RAM, 5030mAh బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్!

Poco M6 new mobile launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో ఇప్పటికే అతి చౌక ధరలో రిలీజ్ చేసిన Poco M6 అండ్ Poco M6 Pro ఫోన్‌లు మార్కెట్‌లో మంచి స్పందన అందుకుంటున్నాయి. అయితే తాజాగా Poco M6లో మరో వేరియంట్‌ను కంపెనీ మార్కెట్‌లోకి దించింది. అయితే ఈసారి దీనిలో హై క్వాలిటీ కెమెరా, అధిక శక్తినిచ్చే బ్యాటరీ ప్యాక్‌తో సహా మరిన్ని ఫీచర్లను అందించింది. Poco తన తాజా స్మార్ట్‌ఫోన్‌గా Poco M6 ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్‌గా ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అందించబడింది. ఇది 5000mAh కంటే ఎక్కువ కెపాసిటీ గల బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 8 GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ఫోన్‌లో అందించబడింది. దీని ధర, అన్ని స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


Poco M6 Price

కంపెనీ Poco M6 ఫోన్‌ను 6 GB RAM + 128 GB స్టోరేజ్.. అలాగే 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదల చేసింది. ఫోన్ 6 GB RAM వేరియంట్ $129గా ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 10,700, అలాగే దీని హై వేరియంట్ 8 GB RAM వేరియంట్ $149గా నిర్ణయించబడింది. భారతీయ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 12,400 ధరకు వస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది.


Poco M6 Specifications

Poco M6 6.79-అంగుళాల IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది Full HD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ మొబైైల్ ప్రకాశం 550 నిట్‌ల వరకు ఉంటుంది. దీని డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్‌లో వస్తుంది. దీనిలో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చబడింది. ఫోన్ వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించబడింది. ఫోన్ వెనుక ప్యానెల్ గాజుతో తయారు చేయబడింది. ఈ ఫోన్ Android 14 ఆధారిత HyperOS స్కిన్‌పై నడుస్తుంది.

Also Read: రాసిపెట్టుకో బ్రో.. పోకో నుంచి కొత్త 5G ఫోన్.. కేక పుట్టిస్తుంది అంతే..!

Poco ఫోన్ Helio G91 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీనితో గరిష్టంగా 8 GB RAM + 256 GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని బ్యాటరీ 5,030mAh. దీనితో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించబడుతుంది. ఫోన్‌లో హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ఉంది.. కాబట్టి మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది డ్యూయల్ సిమ్.. 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, NFC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB-C కనెక్టివిటీని కలిగి ఉంది.

Tags

Related News

Jio Network: జియో, వి నెట్‌వర్క్‌లో అంతరాయం.. అసలు ఏమైంది?

Cooking Oil: ఏంటీ.. వాడేసిన వంట నూనెతో విమానాలు నడిపేస్తారా.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

Chinese Robot: పిల్లలను కనే రోబోలు వచ్చేస్తున్నాయ్.. జస్ట్ ఇలా చేస్తే చాలు, పండంటి బిడ్డ మీ చేతిలో!

Infinix Hot 60i vs Tecno Spark Go: ₹10,000 లోపు ధరలో కొత్త 5G ఫోన్లు.. ఏది బెటర్?

Galaxy S24 Ultra Alternatives: గెలాక్సీ S24 అల్ట్రాకు పోటీనిచ్చే ప్రీమియం ఫోన్లు.. తక్కువ ధర, అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌కు చెక్

Vivo G3 5G Launch: వివో G3 5G విడుదల.. ₹20,000 లోపు ధరలో 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే

Big Stories

×