EPAPER

Jayashankar Russia Tour : రష్యా వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్.. వాటి జోలికి వెళ్లొద్దని చెప్పడానికే..

Jayashankar Russia Tour : రష్యా వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్.. వాటి జోలికి వెళ్లొద్దని చెప్పడానికే..

Jayshankar Russia Tour : విదేశాంగ మంత్రి జైశంకర్‌ నవంబర్‌లో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్‌ 8న ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని మాస్కో ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. భారత్‌, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారని మాస్కో ఆ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాల ప్రస్తావన వస్తున్న సమయంలో జై శంకర్ రష్యా పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఉక్రెయిన్ కూడా తగ్గకుండా నువ్వా నేనా అనే తరహాలో వ్యవహరిస్తుంది. ఉక్రియన్, రష్యా యుద్ధం తీవ్రతరమౌతే అది ప్రపంచానికి పెను ముప్పుగా మారనుందని భారత్ భావిస్తోంది. ఈ విషయంపైనే రష్యా విదేశాంగ మంత్రితో చర్చించడానికి జైశంకర్ రష్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

అణ్వాయుధాలను కూడా ఇరు దేశాలు ప్రయోగించే ఆస్కారం కనబడుతోంది. ఉక్రెయిన్ డర్టీ బాంబ్ తయారు చేస్తోందని రష్యా ఆరోపించింది. మరో వైపు రష్యా అణు దాడికి సిద్ధమైందని ఉక్రెయిన్ పేర్కొంటుంది. ఈ నేపధ్యంలో జయశంకర్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవళ రష్యా రక్షణమంత్రి సెర్గీ షోయిగుతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్‌లో ఇదే అంశంపై ఫోన్లో మాట్లాడారు. ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుద్దం చేసే సమయం కాదని సూచించినట్లు సమాచారం.


Tags

Related News

PM Modi: ప్రపంచానికి భారత్ ఆశాకిరణం.. ప్రధాని మోదీ

Sekhar Basha : మరో వివాదంలో ఆర్జే శేఖర్ బాషా .. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Big Stories

×