Big Stories

JEE Main Admit Cards : జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

- Advertisement -

JEE Main Session 2 Admit Cards Release : జేఈఈ మెయిన్ (సెషన్ -2) పరీక్ష అడ్మిట్ కార్డులను ఎన్ టీఏ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకూ జరగనున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఇటీవలే విడుదలయ్యాయి. 4,5,6 తేదీల్లో జరగనున్న బీఈ, బీటెక్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది.

- Advertisement -

అడ్మిట్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసుకునే విద్యార్థులు https://jeemainsession2.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card లింక్ ను ఓపెన్ చేసి.. మీ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, కోర్సు, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డు వస్తుంది. కాగా.. ఏప్రిల్ 8,9 తేదీలలో పేపర్ -1, 12న పేపర్ 2 ఎ, బి పరీక్షలు జరగనున్నాయి. వాటికి త్వరలోనే అడ్మిట్ కార్డుల్ని విడుదల చేయనుంది.

Also Read : జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. కొత్త తేదీలివే..

ఇటీవలే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల తేదీలను మార్చింది. తొలుత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినప్పుడు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న ఎన్టీఏ.. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

రెండు షిఫ్టుల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. పేపర్ 2 పరీక్ష మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12న.. పేపర్ 2A (B. Arch), పేపర్ 2B (B.Planning), పేపర్ 2A & 2B (B.Arch & B. ప్లానింగ్ రెండూ) మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9:00 నుండి 12:30 వరకు నిర్వహించబడతాయి. దేశం వెలుపల ఉన్న 22 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 319 నగరాల్లోని వివిధ కేంద్రాలలో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News