Big Stories

JEE Main Exams : జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. కొత్త తేదీలివే..

- Advertisement -

JEE Main Exmas 2024 New Schedule : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2024 (JEE Main 2024) సెషన్ 2 పరీక్షల తేదీలను మరోసారి సవరించింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్స్ (Joint Entrance Examination) పరీక్షలు ఏప్రిల్ 4న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగుస్తాయని తెలిపింది.

- Advertisement -

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కొత్త పరీక్షల తేదీల షెడ్యూల్ ను jeemain.nta.ac.in లో చూడవచ్చు. తొలుత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినప్పుడు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య పరీక్షలు జరుగుతాయని పేర్కొన్న ఎన్టీఏ.. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బోర్డు పరీక్షల కారణంగా.. తాజాగా ఆ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేసింది.

Also Read : జేఈఈ మెయిన్స్ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. 31న అడ్మిట్ కార్డుల!

తాజా షెడ్యూల్ ప్రకారం.. JEE మెయిన్ ఏప్రిల్ 2024 సెషన్ పేపర్ 1 (B.E./B.Tech) పరీక్ష ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుంది. పేపర్ 2 పరీక్ష ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. పేపర్ 2 పరీక్ష మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12న.. పేపర్ 2A (B. Arch), పేపర్ 2B (B.Planning), పేపర్ 2A & 2B (B.Arch & B. ప్లానింగ్ రెండూ) మొదటి షిఫ్ట్‌లో ఉదయం 9:00 నుండి 12:30 వరకు నిర్వహించబడతాయి. దేశం వెలుపల ఉన్న 22 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 319 నగరాల్లోని వివిధ కేంద్రాలలో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News