JEE Mains 2024 answer key(Telugu news updates): దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ(JEE Main 2024 Session-1 Answer Key) విడుదలైంది. జాతీయ పరీక్షల సంస్థ (NTA) జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించింది.
తన అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in లో జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఆన్సర్ కీని ఫిబ్రవరి 6న విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలతో పాటు రెస్పాన్స్ షీట్‌లనూ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ కీ పై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఫిబ్రవరి 8 వరకు ఛాలెంజ్ చేసే సౌకర్యాన్ని కల్పించింది. 8న రాత్రి 11 గంటలలోపే అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపింది.
ఒకవేళ అభ్యర్థులు తెలిపిన సందేహాలు సరైనవే అయితే.. ఆన్సర్ కీ ని సవరించి తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు 12,95,617మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 12,25,529 మంది హాజరయ్యారు.