Big Stories

JEE Mains 2024: జేఈఈ మెయిన్స్ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. 31న అడ్మిట్ కార్డుల!

JEE Mains 2024
JEE Mains 2024

JEE Mains 2024: ఏప్రిల్ 4వ తేదీన జరగనున్న జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 పరీక్షల అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ను నేడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 31 తేదీన అడ్మిట్ కార్డులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్లో అధికారులు పొందుపరచనున్నారు.

- Advertisement -

ఏప్రిల్ 4వ తేదీన జరగబోయే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అడ్మిట్ కార్డుల్లో ఉంటాయి. అయితే అడ్మిట్ కార్డులు లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులోనే ఎగ్జామ్ సెంటర్ డిటేయిల్స్, రిపోర్టింగ్ టైం వంటివి పొందుపరుస్తారు. ఈ తరుణంలో పరీక్షా కేంద్రాలకు అడ్మిట్ కార్డులతో పాటు ఐడీ ప్రూఫ్ ను కూడా వెంట తీసుకెళ్లాలి.

- Advertisement -

Also Read: రెండో దశ లోక్ సభ ఎన్నికలు.. నామినేషన్ల ప్రక్రియ షురూ..

అడ్మిట్ కార్డులను అధికారికంగా విడుదల చేసే తేదీని ఎన్టీఏ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే
తేదీని ప్రకటించకపోయినా కూడా.. పరీక్షకు రెండు నుంచి ఐదు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. ఈ తరుణంలో మార్చి 31వ తేదీన అడ్మిట్ కార్డులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. jeemain.nta.ac.in వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇక నేడు విడుదల చేసిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లో విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష పట్టణంకు సబంధించిన వివరాలు ఉంటాయి. ఈ సమాచారం కోసం మాత్రమే ఇంటిమేషన్ స్లిప్ ఉపయోగపడుతుంది. ఈ స్లిప్ పరీక్ష రోజు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం అడ్మిట్ కార్డును మాత్రమే వెంట తీసుకుని వెళితే సరిపోతుంది. మరోవైపు ఎన్టీఏ విడుదల చేసే అడ్మిట్ కార్డులలో లోపాలు ఉంటే వెంటనే కంప్లైంట్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్, పేరు వంటి తదితర వ్యక్తిగత వివరాల్లో లోపం ఉంటే వెంటనే ఎన్టీఏ హెల్ప్ నంబర్ కు కాల్ చేసి సరిచేసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News