Big Stories

Manamey: శర్వానంద్ ‘మనమే’ నుండి ఆకట్టుకుంటున్న ఫస్ట్ సాంగ్

Manamey
Manamey

Manamey: కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించేందుకు హీరో శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. ఎక్కువగా మాస్ సినిమాల జోలికి పోకుండా ఫ్యామిలి ఎంటర్‌టైనర్ సినిమాలే చేస్తుంటాడు. అయితే ఈ సారి కూడా అలాంటి క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

- Advertisement -

ప్రస్తుతం శర్వానంద్ తన కెరీర్‌లో 35వ సినిమా చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఇటీవల ‘మనమే’ అనే టైటిల్ ఖరారు చేశారు.

- Advertisement -

ప్రముఖ బడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది బాసూ.. ఎలా ఉందో మీరూ చూసేయండి

ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘నా మాటే’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను వదిలారు. ఈ సాంగ్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కలర్ ఫుల్‌గా ఉంటూ అట్రాక్ట్ చేస్తోంది. శర్వానంద్ క్లాసిక్ డ్యాన్స్ చాలా బాగుంది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శర్వాకి జోడీగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News