BigTV English

Jharkhand MLAs In Hyderabad : రిసార్ట్ పాలిటిక్స్.. హైదరాబాద్‌‌లో జేఎంఎం ఎమ్మెల్యేల క్యాంపు..

Jharkhand MLAs In Hyderabad : రిసార్ట్ పాలిటిక్స్.. హైదరాబాద్‌‌లో జేఎంఎం ఎమ్మెల్యేల క్యాంపు..
Jharkhand MLAs In Hyderabad

Jharkhand MLAs In Hyderabad : ఝార్ఖండ్‌ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంపయీ సోరెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఇక బలపరీక్షలో నెగ్గారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం నేతృత్వంలోని కూటమి చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ లో క్యాంపునకు తరలించింది. ఝార్ఖండ్‌లోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు రెండు స్పెషల్ ఫ్లైట్లలో రాంచీ నుంచి బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టులో దిగారు. అక్కడ నుంచి వారు బస్సుల్లో నేరుగా శామీర్‌పేట్ వెళ్లారు. అక్కడి లియోనియో రిసార్ట్‌లో క్యాంప్ లో బస చేశారు.


ఫిబ్రవరి 5న ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుంది. తొలి కేబినెట్‌ భేటీ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి అలంగిర్‌ ఆలం మీడియాకు కీలక విషయాలను వెల్లడించారు. మెజార్టీని నిరూపణ కోసం జేఎంఎం సారథ్యంలోని కూటమి ఫిబ్రవరి 5న బలపరీక్షకు సిద్ధమవుతోందన్నారు. రెండు రోజులపాటు అసెంబ్లీ సెషన్‌ జరుగుతుందని తెలిపారు. తొలిరోజు బలపరీక్ష నిర్వహణ ఉంటుందన్నారు. సీఎం చంపయీ సోరెన్‌ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.

మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టుతో ఝార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఎంగా చంపయీ సోరెన్‌ను కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటైంది.


చంపయీ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు గురువారం అర్ధరాత్రి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అలంగిర్‌ ఆలం, ఆర్జేడీ నాయకుడు సత్యానంద్‌ భోక్తా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు.ఝార్ఖండ్‌లో అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ నిరూపించుకునేందుకు 41 మంది సభ్యుల మద్దతు కావాలి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. పూర్తి బలం ఉన్నా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు హైదరాబాద్ క్యాంపునకు తరలించారు.

ఝార్ఖండ్‌ రాజకీయం హైదరాబాద్ చేరింది. రెండు స్పెషల్ ఫ్లైట్లలో రాంచీ నుంచి బయల్దేరిన మహా కూటమి ఎమ్మెల్యేలు బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యారు. అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా శామీర్‌పేట్ వెళ్లారు. అక్కడి లియోనియో రిసార్ట్‌లో క్యాంప్ ఉంటుంది. ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేల రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

Tags

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×