BigTV English

Hookah Ban : కర్ణాటకలో హుక్కా బ్యాన్.. కారణం ఆ కేసులేనా ?

Hookah Ban : కర్ణాటకలో హుక్కా బ్యాన్.. కారణం ఆ కేసులేనా ?

Hookah Banned in Karnataka : కర్ణాటకలో హుక్కా ఉత్పత్తుల అమ్మకాలు, వినియోగం, స్వాధీనం, ప్రకటనలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో తక్షణమే హుక్కా బ్యాన్ చేయడానికి గల కారణాలు వివరించింది. హుక్కా బార్ లు ఒకరినోటితో నేరుగా స్పర్శించడం వల్ల హెర్పెస్, క్షయ, హెపటైటిస్, కోవిడ్-19 వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది.


అలాగే హోటళ్లు, బార్ లు, రెస్టారెంట్లలో హుక్కా వినియోగం సాధారణ ప్రజలకు అంత సురక్షితం కాదని, హుక్కా పీల్చే వారి నుంచి సాధారణ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది. సామాన్యుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం పొగాకు, నికోటిన్ తో ఉండే హుక్కా, టేస్ట్ లెస్ హుక్కా, షీషా, మొలాసిస్ హుక్కా వంటి అన్నిరకాల హుక్కాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 జువెనైల్ జస్టిస్, 2015 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 కర్ణాటక విషాలు రూల్స్, 2015 ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఫైర్ ఫోర్స్ యాక్ట్ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×