Big Stories

TS Budget Sessions 2024 : నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

Telangana budget session 2024

Telangana budget session 2024(Telangana news live):నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నరకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి బడ్జెట్‌ సమావేశాలు కావడంతో.. అందరి దృష్టి కేంద్రీకృతమయింది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం(ఫిబ్రవరి 12) బడ్జెట్ పై సభ్యులు చర్చిస్తారు. బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత.. ఇరిగేషన్ పై శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -

అసెంబ్లీ సమావేశాలలో అధికార, విపక్షాలు వాడీ వేడి చర్చకు సిద్ధమయ్యాయి. కృష్ణానదిపై అవుట్‌లెట్ల నిర్వహణను కృష్ణాబోర్డుకు అప్పగించే విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలకు కొనసాగింపుగా అసెంబ్లీలోనూ ఇదేఅంశంపై తీవ్రస్థాయిలో వాద, ప్రతివాదాలు కొనసాగే అవకాశముంది. BRSఅధినేత KCR తొలిసారి ప్రతిపక్షనేతగా హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుపై BRS, BJPలు నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి.

- Advertisement -

Read More: Dharani Scam : ధరణి పేరుతో 38వేల ఎకరాలు మాయం.. అవన్నీ ఎక్కడ ?

శాసనసభ, మండలి సమావేశాలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు అధికారులను ఆదేశించారు. సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి చర్యలు తీసుకోవాలని సూచించారు. శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై వారు సమీక్ష నిర్వహించారు. మండలి సమావేశాలకు మంత్రులు అందుబాటులో ఉండాలని, అసెంబ్లీ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆదేశించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News