BigTV English

Karnataka Blast Terror Links : ఉగ్రవాదుల చర్యే..రంగంలోకి ఎన్ఐఏ

Karnataka Blast Terror Links : ఉగ్రవాదుల చర్యే..రంగంలోకి ఎన్ఐఏ

Karnataka Blast Terror Links : కర్నాటక ఆటో బ్లాస్ట్‌కు ఉగ్రవాదులకు నేరుగా సంబంధం ఉన్నట్లు తేలింది. కుక్కర్‌లో ఐఈడీ, బ్యాటరీస్ పెట్టి బ్లాస్ట్ జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. బ్లాస్ట్‌లో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ రాజ్ నకిలీ ఖాతాలతో ఐడీలు క్రియేట్ చేసి నెల క్రితం అద్దె ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించారు. ఆటోలో ప్రేమ్ రాజ్ కుక్కర్ తీసుకెళ్తుండగా బ్లాస్ట్ జరిగింది. అయితే ఇది మొదట ప్రమాదవ శాత్తు జరిగిందని అనుకున్నారు. కానీ పేలుడు ప్రదేశంలో కుక్కర్, పేలుడు సామాగ్రి, బ్యాటరీస్ లభ్యమవడంతో పోలీసులు బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. కర్నాటక డీజీపీ సైతం వెంటనే స్పందించి “యాక్ట్ ఆఫ్ టెర్రర్”గా ఈ బ్లాస్ట్‌ని పరిగణించి ట్వీట్ చేశారు. దర్యాప్తు చేయడానికి ఎన్ఐఏ సాయం కోరారు డీజీపీ.


వెంటనే ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. కర్నాటక పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా దీనిపై స్పందిస్తూ.. రాష్ట్రపోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఉగ్రవాదుల దాడిగానే పరిగణిస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సేకరించామన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు మంత్రి జ్ఞానేంద్ర.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×