BigTV English

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలకు 24 శాతం నిధులు పెంపు!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..  జీతాలకు 24 శాతం నిధులు పెంపు!

7th Pay Commission : ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగానే జీతాల వ్యయం కోసం బడ్జెట్ కేటాయింపులను 24 శాతం పెంచింది. ఇది అమలు చేయడం వల్ల ద్రవ్య లోటు లక్ష్యాలను కొనసాగించడంలో సవాళ్లు ఎదురవుతాయి. పాత పెన్షన్ స్కీమ్‌కు తిరిగి రావాలనే డిమాండ్‌లకు దారితీసింది.


వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీతాల వ్యయం కోసం కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో 24 శాతం అంటే రూ. 15, 431 కోట్లును అదనంగా కేటాయించింది. జీతాల పెరుగుదల , మంజూరైన ప్రభుత్వ పోస్టులలో ఖాళీలు డిసెంబర్ 2022 నుంచి దాదాపు 2.5 లక్షల వద్ద స్థిరంగా ఉంది. ఈ పెంపు నిర్ణయం ప్రభుత్వ సిబ్బందికి కొంత ఉత్సాహాన్ని తెస్తుందని భావిస్తున్నారు. ఇంకా సమర్పించాల్సిన ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు ముందుచూపుతో అదనపు కేటాయింపు చేశారు. నివేదిక సమర్పించేందుకు మార్చి 15 వరకు సమయం ఉందని సీఎం సిద్ధరామయ్య ఫిబ్రవరి 12న కమిషన్‌కు తెలిపారు.

2023-24 వేతన వ్యయం సవరించిన అంచనాలు రూ. 65,003 కోట్లు . 2024-25కు సంబంధించి బడ్జెట్ అంచనా రూ. 80,434 కోట్లకు పెరిగింది. 2023-24లో కూడా 2022-23లో రూ. 50,061 కోట్ల నుంచి గణనీయమైన పెరుగుదల కనిపించింది.2023 ఏప్రిల్ లో అమలు చేసిన 17 శాతం మధ్యంతర వేతన పెంపు కారణంగా ఇది జరిగింది. పే ప్యానెల్ నివేదికను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య చెప్పారు. ప్రాథమిక లెక్కల ప్రకారం ఏడవ పే స్కేల్ అమలుకు దాదాపు రూ. 15,000 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎల్‌కె అతీక్ తెలిపారు.


Read More: రైతుల ఛలో ఢిల్లీ మార్చ్.. రెండ్రోజులు వాయిదా

7వ పే స్కేల్ ఏప్రిల్ నుంచి అమలు చేయాలని భావిస్తున్నా కమిషన్ సిఫార్సులు సమర్పించిన తర్వాత విధివిధానాలు రూపొందిస్తామని అతీక్ చెప్పారు. మధ్య-కాల ఆర్థిక విధానం 2024-2028 ప్రకారం సవరించిన పే స్కేల్ అమలు రాబోయే సంవత్సరాల్లో నిబద్ధతతో కూడిన వ్యయంలో తీవ్రమైన పెరుగుదలకు దారితీయవచ్చు. రాబోయే సంవత్సరాల్లో ద్రవ్యలోటు లక్ష్యాలను కొనసాగించడం తీవ్ర సవాలుగా మారవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఏడో పే స్కేల్‌ను అమలు చేయడంలో అదనపు ఆర్థిక చిక్కులు అమలులోకి వచ్చిన మొదటి సంవత్సరానికి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా.

లోక్‌సభ ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులోకి రాకముందే ఈ పెంపుదల అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడక్షరి సీఎస్‌ కోరారు. ఇదే డిమాండ్ తో ఫిబ్రవరి 27న భారీ సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. పాత పెన్షన్ స్కీమ్ తిరిగి తీసుకు రావాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. OPS అమలుకు మరికొంత సమయం కావాలంటే OPS తిరిగి వచ్చే వరకు కొత్త పెన్షన్ స్కీమ్ కోసం తమ జీతాల నుంచి 10 శాతం తగ్గింపును ఆపాలని కోరారు.

ఈ విషయంపై RBI ఇటీవలి నివేదిక ఇచ్చింది. ఓపీఎస్ సంచిత ఆర్థిక భారం ఎన్ పీఎస్ కంటే 4.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అందువల్ల ఓపీఎస్ కి మారడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా వినాశకరమైనదిగా పేర్కొంది. దీర్ఘకాలికంగా, సంక్షేమ, అభివృద్ధి వ్యయాలను తగ్గించడానికి దారి తీస్తుందని ఎమ్ టీఎఫ్ పీ నివేదిక తెలిపింది. 2027-28 నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కర్ణాటకకు దాదాపు రూ. లక్ష కోట్లు అవసరమవుతాయని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ. 80,434 కోట్ల నుంచి జీతంపై వ్యయం క్రమంగా పెరుగుతుందని 2027-28 నాటికి రూ. 98,535 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×