BigTV English

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Kerala Congress expels Simi Rose Bell John over ‘derogatory remarks’ against party’s women leaders: మొన్న కేరళ, నిన్న టీవీ రంగం , కోలీవుడ్, నేడు రాజకీయ రంగం ..కాదేదీ క్యాస్టింగ్ కౌచ్ కి అనర్హం. ఏ రంగంలో చూసినా క్యాస్టింగ్ కౌచ్ దురాఘతం అన్న రీతిగా ఒక్కొక్కటిగా నిజాలు వెలుగు చూస్తున్నాయి. జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు రంగాలలో పనిచేసే మహిళా అభ్యర్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్నాళ్లూ తమ పరువు ఎక్కడ పోతుందో అని ఆలోచించిన మహిళలు ఇకపై మౌనంగా ఉంటే సరిపోదని ధైర్యంగా ముందుకు వస్తున్నారు. కేరళ లో హేమ కమిటీ నివేదికపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. తమ రంగాలలోనూ హేమ కమిటీ లాగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అన్యాయాలపై కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు రోజ్ బెల్ జాన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.


పార్టీ పరువు పోతుందని..

రోజ్ బెల్ జాన్ చేసిన ఆరోపణలు పక్కనపెడితే రాజకీయ రంగంలోనూ ఇలాంటి వి సర్వసాధారణంగా జరుగుతునే ఉంటాయి. అయితే పార్టీ పరువు పోతుందని ఏ ఒక్కరూ బయటకు వచ్చి తమకు అన్యాయం జరుగుతోందని ఇప్పటిదాకా బయటకు రాలేదు. సొంత రాజకీయ పార్టీలోనే కొందరు పెద్దలు కింది స్థాయి నేతలను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా రాజకీయ రంగంలోకి వచ్చే మహిళలకు సైతం ఇలాంటివి తప్పడం లేదు. సాధారణంగా మహిళలు రాజకీయ రంగం వైపు ఎక్కువగా మక్కువ చూపించరు. గత కొన్ని తరాలుగా రాజకీయాలలో పురుషాధిక్యతే ఎక్కువ. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. మహిళలకు కూడా రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా రాజకీయ నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే కొన్ని రాష్ట్రాలలో మహిళలకు కూడా మంత్రులుగా కీలక పదవులు అప్పగిస్తున్నారు.


మహిళలు రాజకీయ రంగంలో..

తమకు ఇచ్చిన పదవిని ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు మహిళలు. అదే మగవారైతే మంత్రులుగా అనేక కుంభకోణాలలో ఇరుక్కుంటూ అటు పార్టీ అధిష్టానానికి, ఇటు రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. ప్రతిపక్షాలకు వీళ్లే స్వయంగా విమర్శనాయుధాలను ఇస్తున్నారు. అందుకే దేశంలో ఇప్పుడు మహిళల విషయంలో కొంత సానుకూల పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజకీయ రంగంలోనూ ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఇప్పుడు పొలిటికల్ రంగం కూడా ఉలిక్కి పడుతోంది. ఇన్నాళ్లూ సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు రాజకీయ నాయకుల తెర వెనుక భాగోతం ఎక్కడ బయట పడుతుందో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కేరళ కాంగ్రెస్ లో దుమారం

కేరళ కాంగ్రెస్ మహిళా నేత రోజ్ బెల్ జాన్ ఆరోపణలతో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పెద్దలు ఇరుకున పడ్డారు. అధిష్టానానికి ఆమెపై ఫిర్యాదులు సైతం వెళ్లాయి. క్యాస్టింగ్ కౌచ్ అంశం మొదట కేరళ సినీ రంగం నుంచే వచ్చింది. అది కాస్తా ఇప్పుడు దావాగ్నిలా అన్ని రంగాలను చుట్టుకుంటోంది. రాజకీయ రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సరిగ్గా కేరళ రాష్ట్రంనుండే రావడం యాథృచ్ఛికమే అయినా..అది ఇప్పుడు కేరళ ప్రాంతాన్నే కాదు దేశ వ్యాప్త రాజకీయ నేతల వ్యక్తిగత ప్రతిష్టకు డ్యామేజ్ కలిగించే అంశమని రాజకీయ నాయకులు హడలిపోతున్నారు.

Related News

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Big Stories

×