E-Paper
Advertisement

కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న కొడుకు… దీపావళికి ఇంటికొస్తే దిమ్మతిరిగే షాక్… ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన డ్రామా

కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న కొడుకు… దీపావళికి ఇంటికొస్తే దిమ్మతిరిగే షాక్… ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన డ్రామా
Advertisement

Family Emotional Drama: పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని, తమకంటే మంచి జీవితాన్ని అనుభవించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం తమకు ఉన్నదంతా ఖర్చు పెట్టి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అయితే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులకు ఏది కావాలో తెలుసుకోవడంలో కొన్నిసార్లు పొరబడుతుంటారు. ఖరీదైన బహుమతులు, లగ్జరీ లైఫ్ ఇస్తేనే వాళ్లు సంతోషంగా ఉంటారని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు కోరుకునేది అవేనా? డబ్బుతో కొత్త ఇల్లు కొనగలిగినా, పాత జ్ఞాపకాలను వదిలించగలమా? ఇలాంటి అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరపైకి తీసుకొచ్చిన హిందీ సినిమా ‘దిల్‌వాలీ దివాలీ’ (Dilwali Diwali). ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా కథేంటి? ఇందులో నటించిన వారు ఎవరు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే..

అన్ష్ సిక్కా అనే యువకుడు కొన్నేళ్లుగా విదేశాల్లో పనిచేస్తూ తన కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకుంటాడు. పంజాబ్‌లో మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతున్న తన తల్లిదండ్రులకు మరింత సౌకర్యవంతమైన జీవితం అందించాలనేది అతని కోరిక. అందుకే వారి కోసం అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్న ఓ ఖరీదైన హై రైజ్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తాడు. తల్లిదండ్రులకు ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముంటుందని భావిస్తాడు. అయితే దీపావళి పండుగ సందర్భంగా అన్ష్ తన కుటుంబాన్ని కలవడానికి ఇంటికి తిరిగి వస్తాడు. తాను కొనిచ్చిన కొత్త అపార్ట్‌మెంట్‌లో కుటుంబమంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తాడు.

Advertisement

ఇక్కడే తండ్రీకొడుకుల మధ్య అసలు సమస్య మొదలవుతుంది. అన్ష్ దృష్టిలో తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలంటే ఖరీదైన అపార్ట్‌మెంట్, అన్ని సౌకర్యాలు ఉండాలి. కానీ తండ్రి ఆలోచన మాత్రం మరోలా ఉంటుంది. తాను ఇన్నాళ్లూ గడిపిన ఇంటితో, ఆ పరిసరాలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఒక్కసారిగా వదులుకోవడం సాధ్యం కాదు. దీపావళి పండుగ నేపథ్యంలో కుటుంబమంతా ఒకచోట చేరడంతో ఈ భిన్నమైన ఆలోచనలు మరింత బయటపడతాయి. తన సక్సెస్ ని పేరెంట్స్ కి చూపించి సర్ ప్రైజ్ చేయాలని, దీపావళి పండుగకు తన సొంత ఊరిలో ఉన్న ఇంటికి వస్తాడు. కానీ, ఊరిలోకి అడుగు పెట్టగానే ఆ కొడుక్కి దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. అతను కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్ వెనుక, తన తండ్రి ఊరిలో చేసిన అప్పులు, త్యాగాలు, ఒక చేదు నిజం దాగి ఉంటుంది.

డబ్బుతో అన్ని సౌకర్యాలు కొనవచ్చు కానీ ప్యూర్ అనుబంధాలను కొనలేము అనే పాయింట్‌ని దర్శకుడు చాలా ఎమోషనల్‌గా చూపెట్టాడు. పండుగ పూట ఆ ఫ్యామిలీలో వచ్చిన ఇగో క్లాషెస్ ఏంటి? కన్నవారి విలువను ఆ కొడుకు ఎలా తెలుసుకున్నాడు? అనేది కన్నీళ్లు పెట్టించే సీన్స్‌తో డిజైన్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకే చోట కూర్చుని చూడాల్సిన ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మూవీ ఇది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Advertisement

రితేష్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రితు మాగో కథ అందించారు. Terribly Tiny Tales నిర్మించిన ఈ సినిమా 2026 నవంబర్ 5న నేరుగా Netflixలో విడుదలైంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ ఆడియోల్లోనూ చూడవచ్చు. ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అన్ష్ సిక్కా పాత్రలో మిహిర్ అహుజా (Mihir Ahuja) నటించగా, అతని తండ్రి పాత్రలో మనోజ్ పహ్వా (Manoj Pahwa) కనిపిస్తారు. నీలు కోహ్లీ (Neelu Kohli), ఔర్రా భట్నాగర్ బదోని (Aurra Bhatnagar Badoni) కీలక పాత్రలు పోషించారు.

కేవలం కొత్త ఇల్లు, డబ్బు, హోదా మాత్రమే జీవితంలో ముఖ్యమైనవి కావని.. మనతో ఉండే మనుషులు, వాళ్లతో మనకున్న అనుబంధాలే అసలైన సంపద అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా చేస్తుంది. ముఖ్యంగా పేరెంట్స్‌తో కలిసి కూర్చుని చూడటానికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావాలనుకునేవారికి ‘దిల్‌వాలీ దివాలీ’ ఒక మంచి ఛాయిస్.

Read Also: కవల సోదరుల మధ్య చిచ్చు… కొడుకు మరణంతో తుపాకీ పట్టిన తల్లి… చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

Tags

Related News

ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టేందుకు మాస్టర్ ప్లాన్… అదే టైమ్‌లో పోలీసుల రచ్చ… నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చే కామెడీ క్రైమ్

తండ్రి కోసం కూతురు ఆడిన ఫేక్ పోలీస్ గేమ్… సీన్లోకి అసలు విలన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్

అఫీషియల్ జైలర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే!

చావు నీడలో ఉన్న 40 ఏళ్ల మహిళ… లక్షలు పోసి కుర్రాడిని కొనుక్కుంటే… నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ భయ్యా

ఈ ఫ్రైడే ఓటీటీలో ఏకంగా 9 తెలుగు సినిమాలు, సిరీస్ లు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

ఖైదీల వరుస మర్డర్స్… కనిపించని దెయ్యాన్ని పట్టుకోవడానికి తంటాలు… జైలు అంటేనే జడిపించే హారర్

ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

Big Stories

Advertisement
×