E-Paper
Advertisement

చెల్లి కోసం సెట్ చేస్తే.. అక్క లవ్ లో దింపిందా.. నిజాలు బయటపెట్టిన సమీరా!

చెల్లి కోసం సెట్ చేస్తే.. అక్క లవ్ లో దింపిందా.. నిజాలు బయటపెట్టిన సమీరా!
Advertisement

Sameera Sherief:ఇదెక్కడి గొడవరా నాయనా.. పెద్దలందరూ కలిసి చెల్లి కోసం ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామనుకుంటే.. ఆ అబ్బాయిని చూసి తానే ప్రేమలో పడిపోయి.. పెళ్లి కూడా చేసుకున్నానని చెబుతోంది ఒక బుల్లితెర హీరోయిన్.. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా? పైగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకున్నారు కూడా.. మరి చెల్లి కోసం సెట్ చేస్తే.. తాను లవ్లో పడిపోయాను అంటూ చెప్పిన ఆ హీరోయిన్ ఎవరు? అసలేం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

చెల్లికి సెట్ చేయాల్సిన వ్యక్తితో ప్రేమలో పడ్డ బుల్లితెర నటి..

ఆమె ఎవరో కాదు ప్రముఖ సీరియల్ నటి సమీరా షరీఫ్ (Sameera sherief) .. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందంతో.. అద్భుతమైన నటనతో బుల్లితెర అభిమానుల హృదయాలను దోచుకుంది. ఒకప్పుడు తన నటనతో టెలివిజన్ రంగంలో దాదాపు 10 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన ఈమె.. ఆ తర్వాత మళ్లీ పెద్దగా కనిపించకుండా పోయింది. మధ్య మధ్యలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చినా.. మళ్లీ ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తోంది. ముఖ్యంగా వెకేషన్ లకు వెళ్లడం, షాపింగ్ , పిల్లలతో కాలక్షేపం ఇలా ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకొంటున్న ఈమె.. తన ప్రేమ, పెళ్లి విషయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది..

Advertisement

సమీరా షరీఫ్ మాట్లాడుతూ..” మా చెల్లెలికి సెట్ చేద్దామని మాట్లాడి.. నేనే ఆ వ్యక్తితో ప్రేమలో పడిపోయాను. మొదట కుటుంబ పరిచయంగా ప్రారంభమైన సంభాషణలు.. అనుకోకుండా ప్రేమగా మారాయి. చివరికి పెళ్లి బంధంగా మారింది. ఒక చిన్న పరిచయం జీవితాన్నే మార్చేసింది” అంటూ సమీరా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమాలకు ఏమాత్రం తీసిపోని ఈ రియల్ లవ్ స్టోరీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మొదలవుతుందో ఎవ్వరు చెప్పలేరు అంటూ సమీరా షరీఫ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

సమీరా షరీఫ్ భర్త ఎవరో కాదు..

సమీరా షరీఫ్ తనను తోటి నటుడు, బుల్లితెర సీరియల్స్ నిర్మాత అయిన సయ్యద్ అన్వర్ అహ్మద్ ను నవంబర్ 2019లో వివాహం చేసుకుంది. ఇతను టెలివిజన్ షో ‘పగల్ నిలవు’ లో ఈమెకు సహా నటుడిగా కూడా పనిచేశారు. ఇకపోతే ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సయ్యద్ అన్వర్ అహ్మద్ ఎవరో కాదు ‘నిన్నే పెళ్ళాడుతా’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటి షానూరు సన కొడుకు. ఈమె దక్షిణాది భారత భాషలో సుమారుగా 200 కు పైగా చిత్రాలలో నటించి ఇప్పుడు అడపాదడపా బుల్లితెర సీరియల్స్ లో కూడా కనిపిస్తోంది.

Advertisement

also read:సంకీర్తనలతో భక్తులను అలరిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

తెలుగు బుల్లితెర ఫేవరెట్ హీరోయిన్ గా సమీరా..

సమీరా షరీఫ్ విషయానికొస్తే.. 2006లో ప్రసారమైన ఆడపిల్ల అనే సీరియల్ తో తన కెరీర్ మొదలు పెట్టింది. హీరోయిన్గా మొదటి ప్రయత్నంతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈమె.. ఆ తర్వాత భార్యామణి, అభిషేకం, మూడుముళ్ల బంధం, ప్రతిబింబం, మంగమ్మగారి మనవరాలు వంటి సీరియల్స్ తో పాటు తమిళ్ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది.

Tags

Related News

యాంకర్ సౌమ్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? పాప రిచ్..

Karthika Deepam 2 Serial Today Episode November 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను ఇంట్లోంచి గెంటేసిన సుమిత్ర

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు టెన్షన్.. చందు సీరియస్.. రామరాజుది ఎంత గొప్ప మనసో కదా..

Brahmamudi Serial Today Episode November 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు షాక్ ఇచ్చిన రాజు, ఇందు

Podarillu Today Episode : శైలు మాటతో వరాలు మైండ్ బ్లాక్.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. శైలును వదిలేసిన కేశవ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. అవని దెబ్బకు అవుట్.. ఇంట్లో దెయ్యం..

Big Stories

Advertisement
×