E-Paper
Advertisement

మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!

మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!
Advertisement

NDA Alliance: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో పాటు.. ‘ఎన్డీయే’ (NDA)లో కూటమిలో చేరేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-SP) గట్టిగానే బేరసారాలు సాగిస్తోందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ప్రతిఫలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పదవుల కోసం పవార్ పార్టీ పట్టుబడుతున్నట్లు సమాచారం. నవంబర్ 30 నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈలోగా బీజేపీ అధినాయకత్వంలో ఓ ఒప్పందానికి రావాలని ఎన్సీపీ భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కేబినేట్ బెర్త్ కోసం చర్చలు

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేకు కేంద్ర కేబినేట్ బెర్త్ కల్పించాలని ఎన్సీపీ (ఎస్పీ) గట్టిగా కోరుతోంది. ఇన్నాళ్లు ఇండియా కూటమి తరపున కేంద్రంపై గట్టిగా పోరాడుతూ వచ్చిన ఆమె.. గత కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వైపు ఎన్సీపీ అడుగు వేస్తున్నట్లుగా ఆమె హింట్ ఇచ్చేశారన్న ప్రచారం ఉంది.

మహారాష్ట్రలోనూ వాటాకు పట్టు

Advertisement

కేంద్రంతో పాటు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలోనూ రెండు కేబినెట్ పదవుల కోసం శరద్ పవార్ పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ఎన్సీపీకి చెందిన మరో వర్గం భాగస్వామిగా ఉంది. ఒప్పందం ఖరారు అయితే ఎన్సీపీ (ఎస్పీ) సీనియర్ నేత జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖ దక్కే అవకాశం ఉండగా.. మరో కేబినెట్ పదవి సీనియర్ నేత జితేంద్ర అవ్హాద్‌కు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకు రెండు సహాయ మంత్రి (MoS) పదవులను కూడా ఆ పార్టీ కోరుతోంది.

కేంద్రానికి ఎన్సీపీ అవసరముందా?

అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం సుప్రియా సూలే పేరును శరద్ పవార్ ప్రతిపాదిస్తున్నారంటూ వస్తున్న వార్తలను పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కాబట్టి ఆ ప్రచారం నిరాధారమైనదని సుప్రియా సూలే ఇటీవలే స్పష్టం చేశారు. అయితే లోక్‌సభలో ఎన్సీపీ (ఎస్పీ)కి ఉన్న ఎనిమిది మంది ఎంపీల మద్దతు ఎన్డీయేకు అత్యంత కీలకంగా మారనుంది. డీలిమిటేషన్ బిల్లును గట్టెక్కించుకునేందుకు ఈ బలం ఎన్డీయేకు ఎంతో అవసరం.

కాంగ్రెస్‌కు శరద్ పవార్ ఫోన్

Advertisement

మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరద్ పవార్.. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఫోన్ చేసి తమ పార్టీకున్న ‘అనివార్య పరిస్థితులను’ వివరించినట్లు సమాచారం. ఎన్సీపీ (ఎస్పీ)లో మరోసారి చీలిక రాకుండా నివారించాలంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్పనిసరి అని ఆయన ఇండియా కూటమి మిత్రపక్షాలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ప్రతి 17 గంటలకో బాల్య వివాహం.. తెలంగాణలో షాకింగ్ గణాంకాలు.. రంగంలోకి పోలీస్ శాఖ!

కాంగ్రెస్ రియాక్షన్ ఇదే

ఈ పరిణామాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఘాటుగా స్పందించింది. 85 ఏళ్ల వయసులో శరద్ పవార్‌ను తిరిగి రాజ్యసభకు పంపేందుకు తమ పార్టీ ఆయనకు అండగా నిలిచిందని గుర్తుచేసింది. ‘ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రలో 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్సీపీ పార్టీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయినా శరద్ పవార్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సుప్రియా సూలే కోరగానే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు?’ అని పోస్ట్ చేస్తూ ప్రశ్నించింది.

Also Read: మన్యం జిల్లాల విషాదం.. రైలు కింద పడి ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

Tags

Related News

మహిళా కలెక్టర్‌పై లైంగిక వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ అరెస్టు.. అసలేం జరిగిందంటే?

‘రామాయణ’ చిత్రానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. పిటిషనర్లకు ధర్మాసనం స్ట్రాంగ్ కౌంటర్!

యూపీలో సీట్ల లొల్లి.. కాంగ్రెస్‌తో చీలికలంటూ ప్రచారం.. అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇదే!

మమతా బెనర్జీకి భారీ ఊరట.. స్పీకర్‌కు కలకత్తా హైకోర్టు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ నియామకం కొట్టివేత!

గెలుపు కోసం స్కెచ్.. డ్రెస్ మార్చి మూడు రకాలుగా నామినేషన్ వేసిన మహిళ.. చివరకు ఏమైందంటే?

మగ పోలీసు పెళ్లిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. ఆఖరి నిమిషంలో రచ్చ రచ్చ.. కారణం ఏంటంటే?

కార్తీక దీపం వివాదం.. మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×