Big Stories

Lok Sabha Phase 2 Voting: ఓటు వేసిన ప్రముఖులు.. ఏం చెప్పారంటే..?

Lok Sabha Phase 2 Voting: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొత్తం 13 రాష్ట్రాలలోని 88 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే, ఈ పోలింగ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ప్రముఖ రచయిత సుధా మూర్తి బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతుంటారని, కానీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదని, అలా ఉండొద్దు.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఇంట్లో కూర్చోవొద్దు.. బయటకి వచ్చి ఓటు వేసి మీ నాయకుడిని ఎన్నుకోండి.. అది మీ హక్కు అంటూ ఆమె చెప్పారు.

- Advertisement -

Also Read:

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ స్టేషన్ కు చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాలావర్ లో బీజేపీ సీనియర్ లీడర్ వసుంధర రాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం అభివృద్ధి కావాలనుకుంటోంది.. ఖచ్చితంగా దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి ప్రహ్లద్ సింగ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News