BigTV English

Gyanvapi Case : జ్ఞానవాపి కేసులో సంచలన తీర్పు.. మసీదు ప్రాంగణంలో పూజలకు అనుమతి..

Gyanvapi Case : జ్ఞానవాపి కేసులో సంచలన తీర్పు.. మసీదు ప్రాంగణంలో పూజలకు అనుమతి..
Current news from india

Gyanvapi case update today(Current news from India):


జ్ఞానవాపి కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మసీదు ప్రాంగణంలోని దేవతల ప్రతిమలకు పూజలు చేసేందుకు.. హిందువులకు అనుమతించింది. పూజలు చేసుకునేలా వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

మసీదు ప్రాంగణంలో.. హిందూ దేవుళ్ల విగ్రహాలు, పలు శాసనాలు ఉన్నట్లు ఆర్కియాలజీ సర్వేలో వెల్లడైంది. వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ఆర్కియాలజీ అధికారులు నివేదికలో తెలిపారు. హనుమంతుడు, విష్ణువు విగ్రహాలు ఉన్నాయని తాజాగా బయటకు వచ్చింది. మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది.


నాలుగు చేతులతో ఉన్న సంప్రదాయ భంగిమలో శంకు, చక్రాలు ధరించి కూర్చుని ఉన్న విరిగిన విగ్రహం ఒకటి తవ్వకాల్లో బయటపడినట్టు తెలుస్తోంది. అలాగే విష్ణువు రూపాలతో ఉన్న మరో రెండు శిల్పాలు దొరికాయి. వాటిని మధ్యయుగ ప్రారంభం కాలం నాటివిగా గుర్తించారు. ఇందులో ఒక విగ్రహం నాలుగు చేతులున్నాయి.అందులో మూడు చేతులు, ముఖం దెబ్బతిని ఉన్నాయి. ఓ పీఠంపైన నిలబడిన ఆకారంలో ఉంది. మరొటి విష్ణువు పక్కన భక్తుడు, పరిచారిక ఉన్నట్టుగా ఉంది. మరో శిల్పం హనుమంతుడి పైభాగానికి సంబంధించినది.

ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న వారణాసి జిల్లా కోర్టు హిందువుల పూజలకు అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

.

.

Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×