BigTV English

DNS: వివాదంలో చిక్కుకున్న నాగార్జున, ధనుష్ మూవీ.. షూటింగ్‌కు అనుమతి రద్దు

DNS: వివాదంలో చిక్కుకున్న నాగార్జున, ధనుష్ మూవీ.. షూటింగ్‌కు అనుమతి రద్దు

DNS: అక్కినేని నాగార్జున నటిస్తోన్న కొత్త మల్టీస్టారర్ చిత్రానికి తాజాగా షాక్ తగిలింది. షూటింగ్ ఆపాలంటూ అధికారులు అనుమతులు రద్దు చేశారు. ఇంతకీ నాగ్ నటిస్తోన్న ఆ కొత్త చిత్రం ఏంటి?.. ఎందువల్ల షూటింగ్ ఆగిపోయింది?.. అనే విషయానికొస్తే..


డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తుండగా.. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘DNS’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి తాజాగా ఓ షాక్ తగిలింది. తిరుపతిలోని అలిపిరిలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ అని తెలుస్తోంది.

అయితే ఈ మూవీ యూనిట్ అలిపిరితో పాటు గోవింద స్వామి ఆలయం, నంది కూడలిలో షూటింగ్ చేసుకోవడానికి ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. అయితే షూటింగ్ కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకూడదని, అలాగే సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల బందోబస్తుకు కూడా పోలీసులను పంపలేమని అధికారులు మూవీ యూనిట్‌కి షరతులు విధించిందట.


ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అదే సమయంలో ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో ఆ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడంలో మూవీ యూనిట్ పూర్తిగా విఫలం అయింది. ఈ కారణంగా వివాదం మొదలైంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిని ఎలా ఇస్తారంటూ పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ తరుణంలోనే నేడు జరగవలసిన షూటింగ్‌కు పోలీసులు అనుమతులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×