BigTV English

Kolkata Trainee Doctor Case: సీఎం మమతా అలా చేస్తారని అనుకోలేదు.. కోల్‌కతా బాధితురాలి తండ్రి

Kolkata Trainee Doctor Case: సీఎం మమతా అలా చేస్తారని అనుకోలేదు.. కోల్‌కతా బాధితురాలి తండ్రి

kolkata trainee doctor case Victim’s Mourning Parents Slam CM Mamata Banerjee: ఇంతపెద్ద వ్యవస్ద.. ఇంత మంది డాక్టర్లు.. సెక్యూరిటీ.. అయినా ఏం లాభం.. ఓ నిండు జీవితం కామాంధుడి చేతులో బలైపోయింది. అత్యంత దారుణాతి దారుణంగా శరీరానికి తూట్లు పడ్డాయి. ఓ వైపు ఇంత దారుణమైన ఘటన జరిగితే నెమ్మదిగా దర్యాప్తు జరగడంపై వైద్య విద్యార్దులు ఆందోళన చేశారు. ఈ ఘటన పట్ల సీఎం మమతా బెనర్జీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. న్యాయం చేయాల్సిన ఆమెనే.. న్యాయం కోసం రోడ్డెక్కడంతో ఆమె పై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ట్రైనీ డాక్టర్ బాధితురాలి తల్లితండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు.


తమ కుమార్తె కేసు విషంయంలో మొదట్లో సీఎంపై పూర్తి నమ్మకం ఉండేదన్నారు. కానీ.. కోల్ కతా పోలీసులు వ్యవహరించిన తీరు చూసి పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. ఈ హత్యాచారం కేసులో కనీసం సీబీఐ అయిన న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారని బాధితురాలు తండ్రి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. తమ కుమార్తె డైరీలోని ఓ పేజీని సీబీఐకి అందజేశానని, కానీ అందులోని విషయాలు చర్చించేందుకు వాళ్లు నిరాకరించారని తెలిపారు.

న్యాయం కోసం ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ చేస్తున్న ఆందోళన గురించి బాధితురాలు తండ్రి మాట్లాడుతూ మొదట్లో సీఎంపై చాలా నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆమెనే న్యాయం చాయాల్సిందిపోయి.. న్యాయం కోసం రోడ్డెక్కారు. ఈ కేసు వ్యవహారంలో ఏమీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


తమకు న్యాయం కావాలని సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న సామాన్యులను మాత్రం లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు న్యాయం కోసం ఆందోళన చెందుతున్న ఆమె.. మరోవైపుసామాన్యులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలి తండ్రి ప్రశ్నించారు.

Also Read: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం..వెలుగులోకి సంచలన విషయాలు!

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మాట్లాడుతూ కన్యాశ్రీ పథకం, లక్ష్మి పథకం, ఈ పథకాలన్నీ నకిలీవి. ఎవరైతే ఈ పథకాల ద్వారా  లబ్ధి పొందాలని అనుకుంటున్నారో.. వాటిని పొందేముందు దయచేసి ఓ సారి ఆలోచించండి.. మీ లక్ష్మి ఇంట్లో భద్రంగా ఉందా? లేదా అని సూచించారు.

ఇక మరోవైపు తమ కుమార్తెపై దాడి చేసింది ఒక్కరు కాదని.. అనే అంశంపై మాట్లాడుతూ మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాము. దాడి చేసింది ఒక్కరైతే కాదు అని.. డాక్టర్లు కూడా ఇలా చేయడం కేవలం ఒక్కరి వల్ల కాదు అని చెప్పారు. భద్రత కల్పించాల్సిన వ్యక్తులే బాధ్యత నిర్వహించడంలో పూర్తిగా విఫలమ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×