BigTV English

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Students Died: కైలాసపట్నం అనాధల పాఠశాలలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Kailasapatnam Church Orphans School Students Died: అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో ఒక అనాధల పాఠశాల రన్ అవుతోంది. ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది పిల్లలు ఉండగా.. వారిలో 27 మంది విద్యార్థులు నిన్న ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వారిని డిశ్చార్జ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థుల్లో.. ముగ్గురు మరణించారు. చికిత్స పొందుతూ మరో విద్యార్థి కూడా మరణించడంతో.. మృతుల సంఖ్య 4కి చేరింది.  ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. డిప్యూటీ డీఈఓ విచారణకు ఆదేశించారు. స్కూల్ లో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసిన 24 గంటల తర్వాత తినడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 


 

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×