Big Stories

Narendra Modi : చట్టాల్లోని భాష సామాన్యులకు సులభతరం చెయ్యాలి : ప్రధాని మోదీ

Narendra Modi : చట్టాల్లో ఉన్న క్లిష్ట భాష వల్ల సామాన్యులు పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాని మోడి అన్నారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయశాఖ మంత్రులు, కార్యదర్శులతో జరిగిన వీడియో కన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యులు, నిరుపేదలు కూడా అర్ధం చేసుకునేలా చట్టాలు చేయాలన్నారు ప్రధాని. సూప్రీం కోర్టు తీర్పులు స్థానిక భాషలో అందించే ఏర్పాటు జరిగితే న్యాయ వ్యవస్థ సామన్యులకు, నిరుపేదలకు మరింత చేరువవుతుందన్నారు.

- Advertisement -

పాత బానిసత్వ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత 8 ఏళ్లలో దాదాపు 1500లకు పైగా పాత పనికిరాని చట్టాలను రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ప్రభుత్వంపైన న్యాయ వ్యవస్థపైన నమ్మకం పెరిగేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్యులకు, పేదలకు న్యాయం సులభంగా ఎలా అందించవచ్చనే దానిపై అన్ని రాష్ట్రాల్లోని చట్టాలపై సమీక్ష జరగాలన్నారు.

- Advertisement -

భారత్‌ను 2047కల్లా ప్రపంచంలో ప్రధమ దేశంగా తయారుచేసేలా విద్యార్ధులను తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ సూచించారు.మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ప్రధాని. న్యాయశాస్త్ర కోర్సులు మాతృభాషలో సాగాలే చర్యలు తీసుకోవాలని అన్నారు. చట్టాలను స్థానిక భాషలో రాసి, వాటికి ఆ భాషలోనే వివరణ కూడా ఇవ్వాలన్నారు ప్రధాని మోదీ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News