Karnataka Politics : కర్నాటకలోని మాండ్య జిల్లాలో త్రివేణి సంగమంలో మహాకుంభమేళా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హామీ ఇచ్చారు. మాండ్య అంటే ఇండియా అని ప్రతీ ఒక్కరూ గుర్తు చేస్తుంటారు. మాండ్య జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు సీఎం. ఆదివారం కుంభమేళా ముగింపు కార్యక్రమంలో సీఎం బసవరాజు బొమ్మైతో పాటు, నిర్మలానందనాధ స్వామి, శివరాత్రి దేశికేంద్ర స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాండ్యలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. పంట నష్టపోయిన రైతులకు రెండు నెలల్లో రెండున్నర కోట్ల పరిహారాన్ని అందిచినట్లు చెప్పారు. బెంగళూరు – మైసూరు రహదారుల సమస్యలను ఇంజనీర్లతో మాట్లాడి పరిష్కరించే పనిలో ఉన్నట్లు చెప్పారు. మళవల్లిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యలకు రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించండతోపాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం బసవరాజు బొమ్మై.