Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వెయ్యి కిలోమిటర్లు పూర్తి చేసుకొంది. మొత్తం 3వేల 500 కిలోమీటర్ల జోడో యాత్రలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహం నెలకొంది. రాహుల్ జోడో యాత్ర ప్రస్తుతం కర్నాటకలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 5న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభైన రాహుల్ గాంధీ జోడో యాత్ర..ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా సాగుతోంది. ప్రతీ రోజు సుమారు 25 కిలోమిటర్ల వరకు రాహుల్ నడుస్తున్నారు. ఆయనతో సెల్ఫీ దిగడానికి యువత, పిల్లలు మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారు.
ప్రస్తుతం బళ్లారిలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుండడంతో.. అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. బసవన్న, అంబేడ్కర్, నారాయణ గురు ప్రతిపాదించిన ఐక్యతా సిద్ధాంతం తన పాదయాత్రలో కన్నడీగుల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఈ ఐక్యతను కన్నడీగుల్లోంచి ఎవ్వరూ చెరిపేయలేరన్నారు రాహుల్. తన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్, బీజీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి సిద్ధాంతంతో దేశాన్ని ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.
కార్నాటక ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ దళితులకు, వెనకబడిన తరగతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు 50 శాతం పెరిగినట్లు చెప్పారు. వారికి కేటాయించిన 8వేల కోట్ల రూపాలయను వేరే వాటికి ఖచ్చుచేశారని అన్నారు. బళ్లారితో తమ కుటుంబానికి ఆత్మీయ బంధం ఉందన్నారు రాహుల్ గాంధీ.అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే సాధ్యమైనంత సేవలను బళ్లారికి అందిస్తామన్నారు.