BigTV English

Liberian ship Hijack : లైబీరియా నౌక హైజాక్‌.. అందులో 15 మంది భారతీయులు..

Liberian ship Hijack : లైబీరియా నౌక హైజాక్‌.. అందులో 15 మంది భారతీయులు..

Liberian ship Hijack : హిందూ మహా సముద్రంలో భారత నౌక హైజాక్‌కు గురైంది. ఈ ఘటన సోమాలియా తీరంలో చోటుచేసుకుంది. లైబీరియా జెండాతో ఉన్న నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత నౌకాదళం ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్పందించింది. హైజాకింగ్ గురించి UKMTO ఏజెన్సీకి నౌక సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపింది.


భారత నౌకాదళం వెంటనే స్పందించింది. MV LILA NORFOLK నౌక గమనాన్ని పరిశీలిస్తోంది. ఐఎన్ఎస్ చెన్నైను సముద్రతీర గస్తీ కోసం రంగంలోకి దించింది. ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా పంపింది. నౌకలోని సిబ్బందితో కమ్యునికేషన్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. హైజాక్ కు గురైన భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.

హిందూ మహ మహాసముద్రంలో ఈ ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌ తీరంలో భారత్ కు వస్తున్న ఓ వాణిజ్య నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. సమాచారం అందుకున్న భారత నేవీ వెంటనే ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులను భారత నేవీ సురక్షితంగా కాపాడిందని భారత నౌకాదళం వెల్లడించింది


Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×