E-Paper
Advertisement

INDIA : విపక్షాల కూటమికి లోగో.. ఆవిష్కరణ ఎప్పుడంటే..?

INDIA :  విపక్షాల కూటమికి లోగో.. ఆవిష్కరణ ఎప్పుడంటే..?
Advertisement

INDIA : వచ్చే ఎన్నికల కోసం “I.N.D.I.A” కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు… లోగో విడుదల చేయబోతున్నాయి. కూటమి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… ముంబై జరగబోయే సమావేశంలో లోగో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల్లో ముంబైలో విపక్ష కూటమి సమావేశం జరగనుంది. పాట్నాలో మొదటి సమావేశం జరగగా.. రెండో సమావేశం బెంగళూరులో జరిగింది.

ముంబైలో జరిగే ఇండియా కూటమి మూడో సమావేశానికి ఉద్ధవ్ థాక్రే ఆతిథ్యం ఇవ్వనున్నారు. పాట్నాలో జరిగిన కూటమి సమావేశానికి సుమారు 17 పార్టీలకు చెందిన 32 మంది హాజరయ్యారు. బెంగళూరు సమావేశంలో 26 కూటమి పార్టీలు పాల్గొన్నాయి. ముంబైలో జరిగే మూడో కూటమి సమావేశంలో 26 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 80 మంది నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ముంబై సమావేశంలో మరికొన్ని పార్టీలు కూటమిలో చేరబోతున్నాయని సమాచారం.

Advertisement

కూటమి రెండో సమావేశం అనంతరం NCPలో చీలిక సహా దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యతకు పరీక్ష పెట్టేలా ఢిల్లీ ఆర్డినెన్స్ ఓటింగ్, అవిశ్వాస తీర్మానంపై చర్చలు జరిగాయి. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఇండియా కూటమి జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఐటీ, ఈడీ, సీబీఐ కేసులతో విపక్ష నేతలను బెదిరిస్తూ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమ ఐక్యతను దెబ్బతీయలేవని… ఇంకా చెప్పాలంటే మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో ఇండియా కూటమి లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఏం సందేశం ఇస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×