E-Paper
Advertisement

బిగ్ బాస్ గురించి ఆలోచించడం ఆపండి..వార్నింగ్ ఇచ్చిన కౌశల్!

బిగ్ బాస్ గురించి ఆలోచించడం ఆపండి..వార్నింగ్ ఇచ్చిన కౌశల్!
Advertisement

Kaushal Manda: కౌశల్ మండా పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ 2 విజేతగా ఎంతో సుపరిచితమైన ఈయన ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ బిగ్ బాస్ సీజన్ 10(Bigg Boss 10 Telugu) కార్యక్రమం గురించి ఎన్నో విషయాలను తెలియచేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా కౌశల్ (Kaushal)మరొక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ పెద్ద హెచ్చరికను జారీ చేశారు. ఇకపై ఎవరు బిగ్ బాస్ గురించి ఆలోచించడం ఆపేయండి హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు? ఎవరు వస్తున్నారనే విషయాలను పక్కనపెట్టి మీ గురించి మీరు ఆలోచించుకోండి అంటూ ఈయన తెలిపారు.

హైదరాబాదులో నీటి సమస్యలు..

ఈ విధంగా కౌశల్ ఇలాంటి హెచ్చరిక జారీ చేయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే ఇటీవల ఎల్ నినో ప్రభావం(el nino effect) కారణంగా వర్షాలు లేకపోవడంతో తీవ్రమైన నీటి కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఈ నీటి సమస్య అధికంగా ఉందని ఇప్పటికే పలు గేటెడ్ కమ్యూనిటీలలో నీళ్లు రాక కనీసం వాష్ రూమ్ వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ కోసం పెద్ద ఎత్తున డబ్బులు కడుతున్న మాకే చాలా ఇబ్బందిగా ఉంది. హైదరాబాద్లో బయట నుంచి వాటర్ తెప్పించాలన్న కూడా వాటర్ ట్యాంక్స్ ఎక్కడ దొరకలేదని కౌశల్ తెలిపారు.

మనల్ని మనం కాపాడుకోవాలి..

Advertisement

ఇలా నీటి సమస్యల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇది అందరికీ ఒక రకమైన హెచ్చరిక. మనం ఇప్పుడు నవంబర్ లోనే ఉన్నాము మార్చి వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకుంటేనే భయంగా ఉందని కౌశల్ తెలిపారు. ఇప్పటివరకు బిగ్ బాస్ గురించి ఎవరు హౌస్ లోకి వెళ్తున్నారు ఎవరు బయటకు వస్తున్నారనీ ఆలోచించింది చాలు ఇకపై ఎవరు బిగ్ బాస్ గురించి ఆలోచించకుండా ఈ కరువు నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఆలోచించండి నీటిని సేవ్ చేయండి.. ఎనర్జిని సేవ్ చేయండి అంటూ కౌశల్ హెచ్చరించారు.

?srtk=MXNvamY0ZnV4aHEycQ==

Advertisement

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు లేకపోవడంతో పెద్ద ఎత్తున కరువు తాండవిస్తోంది. హైదరాబాద్ వంటి మహానగరాలలో ఇప్పుడే నీటి కొరత ఏర్పడటంతో విద్యార్థులకు హాస్టల్స్ లో సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా నవంబర్ నెలలోనే నీటి కొరత ఉంటే రాబోయే రోజులలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇప్పటినుంచి నీటిని సేవ్ చేయండి అంటూ కౌశల్ అందరినీ హెచ్చరిస్తూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: ట్రోలర్స్ కు సింగర్ ఝాన్సీ మాస్ వార్నింగ్… నన్ను మించి ఎదగలేరంటూ!

Related News

కనకవ్వ నుంచి మంగ్లీ వరకు.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటున్నారంటే?

ట్రోలర్స్ కు సింగర్ ఝాన్సీ మాస్ వార్నింగ్… నన్ను మించి ఎదగలేరంటూ!

‘దారిపొంటొతుండు’తో సెన్సేషన్..మామిడి మౌనిక పాటకు రూ.లక్షల్లో పారితోషికమా?

నా ఆయుష్షు తీసుకున్నా పర్లేదు.. మా అక్కను బ్రతికించు దేవుడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖేష్!

తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

త్రిగుణ్ పై శివ రివేంజ్.. ఆ బాధ ఏంటో తెలియాలంటూ!

నా కలలను నాశనం చేశారు.. బిగ్ బాస్ తీరుపై ఝాన్సీ మండిపాటు!

Big Stories

Advertisement
×