Big Stories

lungi Politics in Odisha: లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..

lungi Politics in Odisha: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారం చేయడంలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఒడిశాలో మాత్రం ఈసారి లుంగీ ప్రచారం జోరందుకుంది. ఈ లుంగీ ప్రచారంపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం లుంగీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

- Advertisement -

అయితే, రాష్ట్రాలలో రీజనల్ పార్టీలు ఓటర్లను ఆకర్శించేందుకు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయి. ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి, బీజేడీ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఈసారి ఓ వీడియోలో ప్రత్యేకంగా కనిపించారు. లుంగీ కట్టుకుని, చేతిలో శంఖు గుర్తులున్న రెండు ప్లకార్డులను పట్టుకుని ఆ వీడియోలో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను వేడుకున్నారు. అయితే, నవీన్ పట్నాయక్ లుంగీ కట్టుకుని వీడియోలో మాట్లాడడాన్ని ఎద్దేవా చేస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ఆ తరువాత ధర్మేంద్ర ప్రధాన్ కు కౌంటర్ గా బీజేడీ నాయకులు లుంగీలు కట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇలా బీజేడీ నేతలు, బీజేపీ నేతల మధ్య ప్రస్తుతం లుంగీవార్ కొనసాగుతుంది.

- Advertisement -

Also Read: విరిగిపడిన భారీ కొండచరియలు..

ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒడిశాలో లుంగీ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై రాజకీయ నిపుణులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News