BigTV English

Massive Landslide: రహదారి మధ్యలో భారీ గుంత.. ఎలా ఏర్పడిందంటే?

Massive Landslide: రహదారి మధ్యలో భారీ గుంత.. ఎలా ఏర్పడిందంటే?

Massive Landslide: గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అరుణాచల్ ప్రదేశ్ అతలాకుతలమైతుంది. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అరుణాచల్ ప్రదేశ్ లో వరద నీరు భారీగా పొంగిపొర్లుతుంది. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి కొట్టుకుపోయింది.


ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా చైనా సరిహద్దు జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దిబాంగ్ వ్యాలీతో రహదారి కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం జాతీయ రహదారి-33పై హున్లీ మరియు అనిని మధ్య భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై కొంత భాగం కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది.

Also Read: లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..


విషయం తెలుసుకున్న ఎన్ హెచ్ఐడీసీఎల్ సిబ్బంది హైవే మరమ్మతు పనుల చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేదని అధికారులు చెప్పారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. రహదారి పనుల పునరుద్ధరణ కోసం మూడు రోజుల సమయం పడుతుందని తెలిపింది. అయితే, జాతీయ రహదారి-33 దిబాంగ్ వ్యాలీ జిల్లా ప్రజలకు, ఇటు ఆర్మీకి చాలా కీలకంగా ఉంది.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×