BigTV English

Graduate MLC By poll Schedule: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యూయేట్ బైపోల్ షెడ్యూల్ విడుదల.. ఆ రోజే పోలింగ్..

Graduate MLC By poll Schedule: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యూయేట్ బైపోల్ షెడ్యూల్ విడుదల.. ఆ రోజే పోలింగ్..

Graduate MLC By poll Schedule: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 2న బైపోల్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ప్రస్తుత జనగామ ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.


నామినేషన్ల దాఖలుకు చివరితేదీ మే 9 కాగా, నామినేషన్ల పరిశీలన మే 10వ తేదీన జరగనుంది. మే 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఈ బైపోల్ మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. జూన్ 5వ తేదీన కౌంటింగ్ జరగనుంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు ఈ టికెట్ కేటాయించింది. గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ స్వల్ప ఓట్ల తేడాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మరో సారి తీన్మార్ మల్లన్న తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


గతంలో ఈ ఎన్నికకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కుడా పోటీ చేసి ఓటమి చవిచూశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి పోటీ ఎలా ఉంటుందో.. ఎవరు విజయకేతనం ఎగురవేస్తారో జూన్ 5 వరకు వేచి చూడాల్సిందే.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×