Madhya Pradesh: పుణ్యానికి వెళ్తే పాపం మూటగట్టుకున్నట్లు ఉంది ఆ డ్రైవర్ వ్యవహారం. భానుడి భగభగలతో మూగ జీవాలు అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ఓ డ్రైవర్ మూగ జీవాల పట్ల జాలి చూపాడు. ఫలితంగా తన ఉద్యోగాన్ని పొగొట్టుకున్నాడు. సంచలనం రేపిన విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?
అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ ఉంది. పార్కుకు సమీపంలోని ఓ గ్రామం ఉంది. అక్కడ కొద్దిరోజుల కిందట ఓ వ్యక్తి చిరుత పిల్లలకు నీళ్లు ఇచ్చాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. దీనిపై జంతువులకు అనుకూలంగా కొందరు, మరికొందరు ఆ వ్యక్తిపై అనుకూలంగా కామెంట్స్ చేశారు. ఈ యవ్వారం కాస్త వైరల్ కావడంతో పార్క్ అధికారులు దర్యాప్తు చేసి చర్యలు చేపట్టారు.
దాదాపు 40 సెకన్ల నిడివి వీడియోలో ఒక వ్యక్తి డబ్బా నుండి నీటిని ఒక పాత్రలోకి పోశాడు. ఎండ వేడికి తాళలేక సమీపంలోని నీడలో ఉన్న ఐదు చిరుతలు మంచినీరు వేసిన పాత్ర దగ్గరకు వచ్చాయి. ఆ తర్వాత నీటిని తాగడం ప్రారంభించాయి. చిరుతల వద్దకు వెళ్ళడానికి తొలుత కంగారుపడ్డాడు ఆ వ్యక్తి. ఏమైనా చేస్తాయనే భయంతో మెల్లగా వెళ్లాడు.
ఈలోగా అతని వెనుక నిలబడి ఉన్న వ్యక్తులు చిరుతలకు నీళ్లు ఇవ్వమని సలహా ఇచ్చారు. ఈ క్రమంలో తొట్టిలో నీళ్లు వేస్తున్న క్రమంలో చిరుతలు అక్కడికి వచ్చాయి. ఆ సన్నివేశాలు చిత్రీకరించారు ఆపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ALSO READ: సీపీఎం పార్టీలో మార్పులు.. కొత్త తరానికి స్వాగతం
దీనిపై విచారణ చేపట్టారు పార్క్ అధికారులు. చిరుతలకు నీళ్లు ఇచ్చిన వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్. చెట్టు కింద సేద తీరుతున్న జ్వాలా అనే చిరుతకి చెందిన నాలుగు పిల్లలకు నీరు అందిస్తూ పిలిచాడని నిర్థారించారు. అప్పటికే దాహంతో ఉన్న చిరుత పిల్లలు వాటిని తాగాయి.
ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్న వేళ ఆ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు మండిపడ్డారు. అతడ్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవర్ పేరు సత్యనారాయణ గుర్జార్. కొద్దిరోజుల కింద తల్లి చిరుత, దాని పిల్లలను కొన్ని జంతువును వెంబడించాయి. అవన్నీ సమీపంలోని ఓ గ్రామంలోకి వచ్చాయి. పొలంలోని వాటిని చూసిన కొందరు ఆందోళనకు గురయ్యారు.
తల్లి చీతా ఎప్పుడైనా తమ గ్రామానికి రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరైతే చీతాలపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆ పిల్లలు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ క్రమంలో వాటికి నీళ్లు ఇస్తున్న వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో జన్మించిన 11 పిల్లలతో సహా 17 చిరుతలు కునో నేషనల్ పార్క్ అడవిలో తిరుగుతున్నాయి. అందులో తొమ్మిది ఎన్‌క్లోజర్లలో ఉన్నాయి.
నమీబియన్ చిరుతలను సెప్టెంబర్ 17, 2022న భారత్‌కు తీసుకొచ్చారు. అందులో ఐదు ఆడవి, మూడు మగవి ఉన్నట్లు పార్కు అధికారులు ఫోటోలను విడుదల చేశారు. మొట్ట మొదటి ఖండాంతర చిరుతల మార్పిడి ఇది. మరుసటి ఏడాది (2023) ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుండి మరో 12 చిరుతలను తీసుకొచ్చారు. ఇప్పుడు అడవిలో 26 చిరుతలు ఉన్నాయి. వాటిలో 14 ఇండియాలో జన్మించిన పిల్లలు ఉన్నాయి.
Watch: This video, which has gone viral, shows a man offering water to cheetahs reportedly at a village near Kuno National Park in #MadhyaPradesh .
There is no confirmation on the exact location of this place.#cheetah#Summer#KunoNationalPark (Source: https://t.co/LATulZoMld) pic.twitter.com/NQtT4Hs4dj— Deccan Chronicle (@DeccanChronicle) April 6, 2025