OTT Movies:ఒకప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి పెద్దగా ఆదరణ ఉండేది కాదు.. కానీ 2020 సంవత్సరంలో ఎప్పుడైతే కరోనా మొదలై.. లాక్ డౌన్ విధించారో.. అప్పుడు ప్రజలు బయటకు వెళ్లలేక ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఓటీటీలపై మక్కువ చూపారు. ఫలితంగా ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. పైగా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కూడా పెరిగిన నేపథ్యంలో విభిన్నమైన జానర్లలో సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. బయట థియేటర్లలో మండిపోతున్న ధరల కారణంగా.. చాలామంది ఇంట్లోనే కూర్చొని ఓటీటీ సబ్స్రిప్షన్ తీసుకొని, ఇంటిల్లిపాది సంతోషంగా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు థియేటర్లలో విడుదలైన చిత్రాలు 8 వారాలకే ఓటీటీ లోకి వచ్చి అలరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ ఏప్రిల్ రెండో వారం కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయి. మరి ఏ ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధం అయిందో ఇప్పుడు చూద్దాం.
Movies Releasing in Theatres ఈ వారం విడుదలకు సిద్ధమవుతున్న కొత్త సినిమాలు ఇవే..?
నెట్ ఫ్లిక్స్..
పెరుసు : ఏప్రిల్ 11 (తెలుగులో కూడా)
బ్లాక్ మిర్రర్ 7: ఏప్రిల్ 10 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
కిల్ టోనీ: ఏప్రిల్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ )
ఫ్రోజెన్ హాట్ బాయ్స్ : ఏప్రిల్ 10 (ఇంగ్లీష్ )
కోర్ట్ : ఏప్రిల్ 11 (తెలుగు)
నాచురల్ స్టార్ నాని (Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి, దీప నిర్మించిన చిత్రం కోర్ట్ (Court). ప్రియదర్శి(Priyadarshi ), హర్ష రోషన్ (Harsha Roshan), శ్రీదేవి (Sridevi), శివాజీ(Sivaji ) తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో వచ్చింది. కానీ విపరీతమైన ప్రేక్షక ఆదరణ పొంది.. ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి, అటు నిర్మాతలకు భారీ లాభాన్ని అందించగా.. ఇటు నటీనటులకు కూడా మంచి గుర్తింపును అందించింది.ఇకపోతే థియేటర్ లలో సినిమాను మిస్ అయినవారు ఏప్రిల్ 11 నుంచీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.
ఛావా : ఏప్రిల్ 11 :
ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసుడు.. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky Kaushal), ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒదిగిపోయారు.అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆడియన్స్ ను అలరించడానికి ఏప్రిల్ 11న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో..
ఛోరీ 2 -ఏప్రిల్ 11 (హిందీ )
జియో హాట్ స్టార్ ..
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6: యానిమేషన్ సిరీస్ ఏప్రిల్ 11 (హిందీ)