Brahmamudi serial today Episode: కావ్య పూజ చేసి హారతి తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది. ఏంటి ఎవ్వరూ కూడా రెడీ కాలేదని అడుగుతుంది. ఎందుకు కావ్య అని ఇద్రాదేవి అడుగుతుంది. దీంతో ఎందుకేంటి అమ్మమ్మగారు ఈ రోజు శ్రీరామ నవమి ప్రతి సంవత్సరం మనం గుడికి వెళ్లి పూజలు చేయించే వాళ్లం కదా అని కావ్య చెప్తుంది. దీంతో రుద్రాణి ప్రతి సంవత్సరం వెళ్లి పూజలు చేయించేవాళ్లం. కానీ రాజ్ చేతుల మీదుగానే చేయించేవాళ్లం. కానీ లాస్ట్ ఇయర్ మా వదిన గొప్పలకు పోయి నా కొడుకు కోడలు అని మీ ఇద్దరి చేతులు మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించి చాలా గ్రాండ్‌గా సీతారాముల కళ్యాణం జరిపించారు. ఇప్పుడు రాజ్ లేకుండా ఆ గుడికి వెళితే నీ కొడుకు ఎక్కడ కళ్యాణానికి ఎందుకు రాలేదని అడిగితే సమాధానం ఏమని చెప్తారు అంటుంది.
దీంతో కావ్య ఆ సమాధానాలే ఏవో నేను చెప్పుకుంటాను. మామయ్య గుడిలో పూజారికి నేను ఫోన్ చేసి చెప్పాను. మనందరం వెళ్లాలి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అని చెప్పగానే రుద్రాణి ఇప్పుడెందుకు ఇవన్నీ ఇంటి పరువు తీయడం కాకుంటే అంటుంది. ధాన్యలక్ష్మీ కూడా రుద్రాణి మాటలను సమర్థిస్తుంది. ప్రకాష్ కూడ అవును కావ్య రాజ్‌కు ఏమయింది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాము అంటాడు. దీంతో కావ్య చిన్న మామయ్య అందరికీ సమాధానం నేను చెప్తాను అంటున్నాను కదా అనగానే ఏం చెప్తావు రాజ్ బతికే ఉన్నాడని కానీ ఎక్కడున్నాడో తెలియదని చెప్తావా..? అంటాడు రాహుల్. ఇంతలో ఇంద్రాదేవి కావ్యను సమర్థిస్తుంది. అందరం వెళ్లి ఆ దేవుడి కళ్యాణం చేయిద్దామని అంటుంది. ఇంటి పరువు విషయంలో ఎవ్వరూ కంగారు పడవద్దు అసలు ఈ కళ్యాణం జరిపిస్తుందే ఆయన తిరిగి ఇంటికి రావాలని మీరంతా ముందు రెడీ అవ్వండి అని చెప్తుంది. సీతారామయ్య కూడా అందరూ రెడీ అవ్వండి అని చెప్తాడు.
మరోవైపు యామిని అందరినీ పిలిచి త్వరగా రెడీ అవ్వండి అని చెప్తుంది. రెడీ అయి వచ్చి వాళ్ల పేరెంట్స్ ఇంతకీ అల్లుడు గారు ఎక్కడ అని అడుగుతుంది. బావకు నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పలేదు. ఇప్పుడు చెప్పి తీసుకెళ్తాను అంటుంది యామిని. చెప్పుండాల్సింది బేబీ. ఇప్పుడు చెబితే రాకపోతే ఎలా అని వాళ్ల డాడీ అడగ్గానే ఇప్పుడు ఎలాగైనా వస్తాడులే డాడీ అంటుంది యామిని. ఇంతలో రాజ్ వస్తాడు. ఏంటి యామిని ఇంత ట్రెడిషన్‌గా రెడీ అయ్యావు.. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దంతో యామిని పోనీలే బావ ఇన్ని రోజులకు అయినా నేను వేసుకున్న డ్రెస్‌ను గుర్తు పట్టావు. ఇన్ని రోజుల గా నీ నుంచి ఒక్క కాంప్లిమెంట్ కూడా రాలేదు అంటుంది. దీంతో రాజ్ సరే ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ ట్రెడిషనల్ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు అంటాడు. యామిని హ్యాపీగా థాంక్యూ బావ అని చెప్తుంది. సరే ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు అని రాజ్ అడగ్గానే గుడికి వెళ్తున్న విషయం చెప్తుంది యామిని. రాజ్ తాను రానని చెప్తాడు. కానీ యామిని వాళ్లు బలవంతంగా రాజ్‌ను కన్వీన్స్ చేసి గుడికి తీసుకెళ్తారు.
మరోవైపు గుడికి వెళ్లిన దుగ్గిరాల ఫ్యామిలీని అందరూ రాజ్ గురించి అడుగుతారు. కావ్య ఊరెళ్లాడని చెప్తుంది. రుద్రాణి మాత్రం అవును ఊరే వెళ్లాడు.. కానీ ఏ ఊరు వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు వస్తాడో అసలు తెలియదు అని చెప్పడంతో అందరూ రుద్రాణిని తిడతారు. మరోవైపు అదే గుడికి యామిని వాళ్లు రాజ్‌ను తీసుకుని వస్తారు. లోపలికి వెళ్దాం పద అని రాజ్ ను యామిని అడగ్గా.. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా అన్నారు ఫోన్ మాట్లాడిన తర్వాత వస్తాను అని చెప్తాడు. దీంతో యామిని వాళ్లు నేను సృష్టించిన ఫ్రెండ్స్ బావ నాకు తెలియకుండా వాళ్లు నీకెలా ఫోన్ చేస్తారు అని మనసులో అనుకుంటుంది. సరే మాట్లాడి రా బావ అని లోపలికి వెళ్లిపోతుంది. గుడిలో సీతారాముల కళ్యాణంలో దంపతులను పీటల మీద కూర్చోమని పూజారి గారు చెప్పడంతో సుభాష్, అపర్ణ, ఇంద్రాదేవి, సీతారామయ్య పీటల మీద కూర్చుని ఉండగా.. కావ్య కూడా పీట మీద కూర్చోబోతుంటే.. రుద్రాణి ఆపుతుంది. రాజ్ లేకుండా ఒక్క దానివే పీటల మీద కూర్చోకూడదు అని చెప్తుంది. రాజ్ వస్తాడు. చూస్తూ ఉండు అంటూ రాజ్‌ను తీసుకొస్తాను అని కావ్య వెళ్లి రాజ్ ఫోటో తీసుకుని వస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?