MA Baby: సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. మధురైలో జరిగిన సీపీఎం 24వ జాతీయ మహాసభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ఈయన గతంలో కేరళ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీకి ఆరుగురు సభ్యులు ఎన్నిక కాగా.. తొలిసారిగా సీపీఎం కేంద్రకమిటీ సభ్యులుగా ఎన్నికైన జాన్ వెస్లీ, ఎస్ వీరయ్య ఎన్నికయ్యారు. ఏపీ నుంచి పొలిట్ బ్యూరోలోకి రాఘవులు, అరుణ్ కుమార్ లకు చోటు దక్కింది. మొత్తం 18 మందితో కేంద్ర పొలిటి బ్యూరో.. 85 మందితో కేంద్ర కమిటీని ప్రకటించిన సీపీఎం ప్రకటించింది.
ALSO READ: NABARD Jobs: నాబార్డ్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.50 లక్షల జీతం భయ్యా.. నేడే లాస్ట్ డేట్..!
మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే సీపీఎం మహాసభలు తమిళనాడు రాష్ట్రం లోని మదురై లో నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయనను పార్టీ కొత్త కార్యదర్శిగా ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. ఎంఏ బేబీ పేరును సీపీఎం పార్టీ కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్ ప్రతిపాదించారు. పోయిన ఏడాది సెప్టెంబర్‌ల నెలలో సీతారాం ఏచూరి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా కారత్ ఆ పదవికి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.
అయితే, మైనారిటీ కమ్యూనిటీ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేత ఎంఏ బేబీనే కావడం విశేషం. కేరళ, కొల్లాం జిల్లా ప్రక్కులాంలో ఎంఏ బేబీ జన్మించారు. ప్రస్తుతం ఆయన 70 ఏళ్లు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో ప్రారంభించి ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు అయ్యారు. అనంతరం ఆయన పార్టీ యూత్ వింగ్ డీవైఎఫ్ఐలో పనిచేశారు. 1986 నుంచి 1998 వరకూ సీపీఎం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించారు.
1975 నుంచి 1978 వరకు ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులను, యువతను సమీకరించి జైలుశిక్ష కూడా అనుభవించారు. 2006లో కేరళ లోని కుందర నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2006 నుంచి 2011 వరకూ వీఎస్ అచ్యుతానంద్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2011లో తిరిగి కుందర నియోజకవర్గం నుంచే తిరిగి గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కొల్లాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2012 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరో పదవిలో కొనసాగుతున్నారు.
ALSO READ: AAI Recruitment: ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే రూ.31,000