Podarillu Today Episode November 15th : మహాలక్ష్మి గదిలోంచి బయటికి రావడం చూసినా కేశవ అదిగో వస్తుంది చూడు కచ్చితంగా ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది అని చెప్పగానే అందరూ టెన్షన్ పడిపోతూ మహాలక్ష్మి ఏమంటుందో ఏంటో అని చూస్తూ ఉండిపోతారు.. మహాలక్ష్మి మనిషా ఇద్దరూ బయటికి వస్తారు మీ ఫోన్ చార్జింగ్ ఫుల్ అయినట్టుంది ఒకసారి చూసుకోండి అని చక్రీ హింట్ఇస్తాడు. మీరు చాలా మంచి వాళ్ళండి ఫోన్ చార్జింగ్ ఫుల్ అయింది. అంతేగాని మెసేజ్లు వచ్చాయని మీరు ఎందుకు చెప్పలేదు అని కాస్త సీరియస్ అవుతుంది. ఇక తర్వాత ఆ ఫోన్లో స్టేటస్ చూడలేదు అని అనుకుంటారు ఇక మహాలక్ష్మికి స్టేటస్ గురించి ఎంత గుర్తు చేస్తున్నా సరే ఏముంది అక్కడ అని అనుకుంటుంది.
మహాలక్ష్మి స్టేటస్ చూశాను ఏమైంది ఇప్పుడు ఏదైనా కొత్తగా ఉంది అందులో అని కన్నాని అడుగుతుంది. కానీ అది కాదు వదిన అందులో ఏం రాసిందో చూసావా అంటే ఆ చూశాను.. కొన్ని స్టేటస్లుకి నేను లైక్ కూడా కొట్టాను. ఇప్పుడు ఏమైంది ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు చెప్పండి అని మహాలక్ష్మి ఎంతగా అడిగిన సరే ఎవ్వరు చెప్పరు నువ్వు చూసావు కదా నీకే అర్థమవుతుంది లే అని అనుకుంటారు. ఇక సాయంత్రం అయితే దీపావళి పండుగ సంబరాలు మొదలు పెట్టాలని అనుకుంటారు అందరూ కూడా దీపావళి పండుగ గురించి చాలా గొప్పగా జరుపుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ట్రెడిషనల్ లుక్ లో చూడ్డానికి చాలా అందంగా వాళ్ళందరూ కనిపించడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. మొత్తానికి పొదరిల్లు సీరియల్ లో దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.
కన్నా నీ నారాయణని కలిపేందుకు ఏదో ప్లాన్ చేస్తానన్నారు ఏం ప్లాన్ చేశారు.. ఎక్కడ ప్లాన్ చేశారు అని మహాలక్ష్మి చక్రిని లోపలికి తీసుకుని వెళ్లి అడుగుతుంది. అయితే మహాలక్ష్మి చక్రి చేయి పట్టుకుని లోపలికి వెళ్తూ ఉండదా అది చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ త్వరలోనే కలిసిపోతారు అని నాకు అనిపిస్తుంది అని కేశవ మాధవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక నారాయణ కూడా చక్రి మహాలక్ష్మి ఇద్దరు కలిసిపోతే శాశ్వతంగా మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది అని సంతోషంగా ఉంటాడు. ఇక చక్రి మహాలక్ష్మి తన చెయ్యి పట్టుకుని వెళుతుంది అని అలా చూస్తూ తన వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు. అదేవిధంగా కేశవ కి ఫోన్ రావడంతో తను కూడా పక్కకు వెళ్ళిపోతాడు ఇక మాధవ్ మనిషా ఇద్దరు కూడా వంట గురించి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు.
మనిషా వంట చేశారా అని అడుగుతుంది నాకు ఏమి అనిపించట్లేదు కదా లోపలికి వెళ్దామని మాతో తనని లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు. అటు కేశవా శైలు తో ఫోన్ మాట్లాడుతూ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఇక కన్నా ఒక్కడే బయట ఉండి బాంబులు కాల్చేందుకు రెడీ అవుతూ ఉంటాడు అది చూసిన నారాయణ కాస్త జాగ్రత్తగా కాలవమని ఎంత చెప్పినా సరే అసలు వినకుండా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని కన్నా తండ్రిని అవమానించేలా మాట్లాడుతాడు.. ఇక కన్నా నీ ఇష్టం మంచిగా జాగ్రత్తగా కాల్చుకోమని చెప్పాను అంతే తప్ప నువ్వు ఇలా అంటావ్ అని నేను అసలు అనుకోలేదు అని నారాయణ ఇక చూస్తూ ఉండిపోతాడు..
అయితే మహాలక్ష్మి కన్నా ని మీ నాన్నని కలపడానికి ఏదో ప్లాన్ చేస్తానని అన్నారు కదా.. ఏం ప్లాన్ అది అని అడుగుతాడు. అసలేం ప్లాన్ చేశారు చెప్పండి అని చెప్పగానే చక్రి ఆ ప్లాన్ గురించి చెప్తాడు అది విన్న మహాలక్ష్మి ఇది ఒక ప్లాను దీనికోసం మేము మళ్ళీ వెయిట్ చేయాలా దేనికన్నా నేను ఏదైనా మంచి ప్లాన్ చేసింది ఏంటి బాగుండేది . మీ మట్టితో ఇలాంటి ప్లాన్ చేస్తారని అస్సలు ఊహించలేదు అని తిడుతుంది. అసలు ఏమనుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు అని చక్రిని మహాలక్ష్మి తిడుతుంది.. ఇక తర్వాత చక్రి చేసేదంతా ఇలానే ఉంటది 50% ఆఫర్ లాగే ఉంది. ఇది కూడా అని మహాలక్ష్మి అనగానే చాలా ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్లిద్దరూ కలపడానికి ఈ దీపావళి పండుగని వాడుకుందాం అని అనుకున్నాను.. కానీ మీకు చెప్పాను కదా అది ఇలానే ఉంటుంది. ఏదో ఒకటి నేనే చేస్తానని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది.
ఇక కన్నా బాంబులు పేలుస్తూ ఉండగా నారాయణ చూసి మురిసిపోతూ ఉంటాడు. అయితే కన్నా బాంబులు పెట్టదని ఇప్పుడు గాలికి ఆ బాంబులు రివర్స్ గా పడిపోతాయి. అయితే ఆ బాంబుల నీ కన్నా వరకే రావడంతో కన్నా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ గట్టిగా అరిచేస్తాడు. కానీ అది చూసి నన్ను నారాయణ కన్నా ని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటాడు తన ప్రాణాలకు తెగించి ఆ బాంబులకి అడ్డుగా నిలబడతాడు. అది చూస్తున్న అందరూ కన్నా అంటూ అరుస్తూ వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…