Delhi Car Crash: రోడ్డుపై అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే. రెప్పపాటులో జరిగే పొరపాటు నిండు ప్రాణాలను బలితీసుకుంటుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో సరిగ్గా ఇలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది. థ్రిల్ కోసం పెంచిన వేగం, 22 ఏళ్ల యువకుడికి మృత్యుపాశమైంది.
అసలేం జరిగిందంటే?
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ లోపల వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే. కానీ, అభినవ్ సింగ్ (22) అనే యువకుడు నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశాడు. ఏకంగా గంటకు 200 కిలోమీటర్ల అత్యధిక వేగంతో కారును టన్నెల్‌లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో టన్నెల్ లోపల ఉన్న మలుపు వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పింది.
తునాతునకలైన కారు.. చెలరేగిన మంటలు
అధిక వేగంతో ఉండటంతో కారు నేరుగా టన్నెల్ గోడను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటి ఎంత తీవ్రంగా ఉందంటే.. కారు ముందు భాగం నుజ్జునుజ్జయి ఇంజిన్ ఏకంగా ఊడి బయటపడింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే కారులో భారీగా మంటలు చెలరేగాయి.
200 కి.మీ.వేగంతో డ్రైవింగ్ .. టన్నెల్‌లో కారు ప్రమాదం
ఢిల్లీ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో అతివేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. 80 కి.మీ. వేగ పరిమితి ఉన్న టన్నెల్‌లో 200 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన కారు, మలుపు వద్ద అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ధాటికి ఇంజిన్ ఊడిపడి కారులో… pic.twitter.com/wgvsAD447h
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2026
కేసు నమోదు..
ఈ భయానక ప్రమాదంలో కారు నడుపుతున్న అభినవ్ సింగ్ బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: చేవెళ్లలో ఘోర ప్రమాదం.. ఆర్మీ వాహనం బోల్తా, 8 మంది జవాన్ల పరిస్థితి విషమం