E-Paper
Advertisement

BSNL దిమ్మతిరిగే ఆఫర్.. జస్ట్ రూ.1కే కొత్త సిమ్.. 24 రోజులు ఫ్రీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

BSNL దిమ్మతిరిగే ఆఫర్.. జస్ట్ రూ.1కే కొత్త సిమ్.. 24 రోజులు ఫ్రీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!
Advertisement

BSNL Freedom 2.0 Plan: ఒకవైపు రీఛార్జ్ ధరలు చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి టైమ్‌లో సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెబుతూ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎస్‌ఎన్ ఒక క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి Freedom 2.0 పేరుతో లాంచ్ చేసిన ఈ స్పెషల్ స్కీమ్ ద్వారా.. కేవలం ఒక్క రూపాయికే కొత్త సిమ్ కనెక్షన్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలు వాడుకోవాలనుకునే వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. అసలు ఈ రూ.1 ప్లాన్‌లో ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా చూద్దాం.

ఫ్రీడమ్ 2.0 ఆఫర్ ప్రత్యేకతేంటి?

బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.1కే కొత్త సిమ్ కార్డును అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఆఫర్ 2027 ఫిబ్రవరి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరలతో ఇబ్బంది పడుతున్న వారికి, తక్కువ ధరలో కొత్త నంబర్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుంది.

24 రోజుల వ్యాలిడిటీ, SMSలు:

Advertisement

ఈ ఒక్క రూపాయి సిమ్ తీసుకున్న వారికి 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో ప్రతిరోజూ 1 జీబీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను వాడుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా వస్తాయి. బ్యాంకింగ్ పనులు, ఓటీపీల కోసం ఎస్ఎంఎస్‌లు చాలా అవసరం కాబట్టి.. ఈ ఫీచర్ కస్టమర్లకు బాగా కలిసొస్తుంది. 24 రోజుల గడువు ముగిసిన తర్వాత మీ అవసరానికి తగ్గట్టుగా నచ్చిన ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: భారత్‌లోకి Motorola Edge 70 Neo 5G.. ఈ ఫోన్ కోసం ఎదురుచూడటానికి ముఖ్య కారణాలివే!

అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం:

Advertisement

ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌లతో పాటు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. అంటే 24 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎన్ని కాల్స్ అయినా మాట్లాడుకోవచ్చు. కొత్త నంబర్ తీసుకొని, మొదటి కొన్ని రోజులు రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టకుండా అన్ని సేవలు పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఈ సిమ్ కార్డును ఎలా పొందాలి?

మీరు కూడా ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే.. మీకు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధీకృత రిటైలర్ వద్దకు వెళ్లాలి. అక్కడ మీ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇచ్చి కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే సిమ్ కార్డు లభ్యత, సంస్థ నిబంధనల ప్రకారం మీకు కొత్త సిమ్ జారీ చేస్తారు.

Also Read: పదేళ్ల తర్వాత ఐఫోన్‌లో భారీ మార్పులు.. నాలుగు వైపులా వంపు తిరిగిన గ్లాస్ డిస్‌ప్లేతో iPhone 20 Pro!

Tags

Related News

భారత్‌లోకి Motorola Edge 70 Neo 5G.. ఈ ఫోన్ కోసం ఎదురుచూడటానికి ముఖ్య కారణాలివే!

పదేళ్ల తర్వాత ఐఫోన్‌లో భారీ మార్పులు.. నాలుగు వైపులా వంపు తిరిగిన గ్లాస్ డిస్‌ప్లేతో iPhone 20 Pro!

BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!

రూ.299కే 1.5GB డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏడాది పాటు ఆ సేవలు ఉచితం!

72 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా హాట్ స్టార్, అన్‌లిమిటెడ్ 5G.. ఈ జియో ప్లాన్‌ భలే ఉందే!

పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!

స్మార్ట్‌ఫోన్లకు పోటీగా HMD 2320 Flip 4G ఫ్లిప్ ఫోన్.. వాకీ-టాకీ ఫీచర్, టైప్-సీ ఛార్జింగ్‌తో అదరగొట్టే స్పెసిఫికేషన్లు!

Big Stories

Advertisement
×