Maharashtra Govt Declares Indigenous Cows Rajyamata-Gomata : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షిండే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హిందువులు పవిత్రంగా భావించే ఆవును మహారాష్ట్ర “రాజమాతగా” నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నానాటికీ దేశంలో ఆవులు తగ్గిపోవడం, పురాతన కాలం నుండి భారతీయ సంస్కృతిలో గోమాత స్థానాన్ని గుర్తుంచుకొని, ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ సాంప్రదాయంలో గోవులకు ఓ ప్రత్యేక స్థానం ఉందని, పురాతన కాలం నుండే ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో పాటు దేశీయ ఆవులు సంఖ్య చాలా వరకు తగ్గిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే సేంద్రియ వ్యవసాయ విధానాలలో తప్పనిసరిగా ఆవుపేడ వాడకం ఉండాలని తెలిపింది. మనుషులు తినే ఆహారంలో తగిన పోషకాలు వీటివల్ల పెరుగుతాయని పేర్కొంది.
ఆవు, దాని ఉత్పత్తులకు సంబంధించి విషయాలు దృష్టిలో పెట్టుకుని సాంస్కృతిక, ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని, అలాగే దేశీయ ఆవులు తగ్గిపోతున్న నేపథ్యంలో ఆవులను పెంచేవారిని ప్రొత్సహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మనదేశంలో గోవుని దేవునిలా పూజిస్తాం. బయటకు వెళ్లేప్పుడు ఆవును చూస్తే మంచి జరుగుతుందని నమ్మేవాళ్లు కూడా ఉంటారు. ఆవు పాలు, పేడ పవిత్రంగా సమృద్ధిగా ఉపయేగిస్తారని వెల్లడించింది. అంతేకాదు ఆవు పాలు తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని, అనేక వ్యాధులను నయం చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: మిథున్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్.. కమల కటాక్షమేనా?
ఇదిలా ఉండే.. ఓవైపు ఆవును రాజమాతగా కొలుస్తుంటే.. మరోవైపు దేవునితో సమానంగా భావించే గోవుల వధ యథేచ్ఛగా జరిగిపోతుందని చెబుతున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా అక్రమ కబేళను నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని రైడ్‌ల చేసిన, జంతు సంరక్షణ సంఘాలు ఆందోళనలు చేపట్టినా.. నిర్వహకులు పట్టించుకున్న పాపానపోలేదు. ఈ గోవధ, గో అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా నిర్వాహకులకు చీమ కూడా కుట్టినట్టు లేదు. ఇకనైనా ప్రభుత్వాలు ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరించి గోవధను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.