2 Year Old Girl Dies After Car’s Airbag Opens: ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్స్ యమపాశమై కాటు వేశాయి. రెండేళ్ల చిన్నారి ప్రాణాలను హరించాయి. ఎయిర్ బ్యాగ్స్ ప్రాణాలు తీయడం ఏంటని షాకవుతున్నారా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే..
కేరళ మలప్పురంలో దారుణం
కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్లారు. కారులో భార్యభర్త ఓ పాపతో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కారులో షికారుకు వెళ్లారు. కొట్టక్కల్, పడపరంబు మధ్యలో ఉన్న పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తారు. హ్యాపీగా జాలీగా గడిపారు. సాయంత్రం కావడంతో తిరుగు ప్రయాణం అయ్యారు. కాసేపటికే వారి జీవితంలో మర్చిపోలేని ఘటన జరిగింది.
కారును ఢీకొట్టిన ట్యాంకర్, పాప మృతి
కొట్టక్కల్ సమీపంలోకి రాగానే వేగంగా వచ్చిన ఓ ట్యాంకర్ వారి కారును ఢీకొట్టింది. బలంగా వచ్చి తగడంతో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ తీవ్రతకు పాపకు ఊపిరి ఆడక స్పాట్ లోనే చనిపోయింది. భర్త డ్రైవ్ చేస్తుంటే భార్య ముందు సీట్లో కూర్చుకుంది. పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఒకేసారి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో చిన్నారి ముఖం మీద గట్టిగా నొక్కినట్లు అయ్యింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడంతో ఆమె చనిపోయింది.
పాప ప్రాణాలు తీసిన ఎయిర్ బ్యాగ్స్.. కారులోని మిగతా వారి ప్రాణాలను మాత్రం కాపాడాయి. తల్లితో పాటు మిగిలిన నలుగురు ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది.
Read Also : పాపులర్ సెడాన్లపై పండుగ ఆఫర్లు, వెంటనే కొనుగోలు చేస్తే రూ. లక్షకు పైగా డిస్కౌంట్ !
ఎయిర్ బ్యాగ్స్ పై తీవ్ర చర్చ
కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా, పాప చనిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆటో మోబైల్ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణం అవుతోంది. వాస్తవానికి గత కొంతకాలంగా ఎయిర్ బ్యాగ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రయాణీకుల భద్రత విషయంలో కార్ల కంపెనీలు కచ్చితమైన నిబంధనలు పాటించాలని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఆటో మోబైల్ సంస్థలు తమ వినియోగదారులకు భద్రత విషయంలో రోజు రోజుకు సరికొత్త అప్ డేట్స్ తీసుకొస్తున్నాయి. గతంలో రెండు, ఆ తర్వాత నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేశాయి. లేటెస్ట్ గా వస్తున్న కార్లలో ఏకంగా 6 ఎయిర్ బ్యాగ్ లను ఏర్పాటు చేస్తున్నాయి. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగినా ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పులేకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఆరు ఎయిర్ బ్యాగ్స్ కారణంగా ప్రమాద సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గుతుంది.
Read Also : పండక్కి సరికొత్త మారుతి సుజుకి డిజైర్, అందుబాటు ధరలోనే.. అద్భుతమైన ఫీచర్స్