Big Stories

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన నిరుద్యోగం.. కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Mallikarjun Kharge
Mallikarjun Kharge

Mallikarjun Kharge on Jobs during Lok Sabha Elections 2024: బీజేపీ పాలనలో దేశంలోని నిరుద్యోగం భారీ స్థాయిలో పెరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రధాని మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే యువతకు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశంగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

- Advertisement -

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగావకాశాలు లభించక విసిగివేసారుతున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఐఐటీల్లో 30 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదని, 21 ఐఐఎంల్లో కేవలం 20 శాతం మందికి మాత్రమే వేసవి ప్లేస్ మెంట్స్ పూర్తి అయ్యాయని ట్వీట్టర్(ఎక్స్)లో వెల్లడించారు.

- Advertisement -

ఎంతో ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంల్లో పరిస్థితే ఇలా ఉంటే దేశవ్యాప్తంగా యువత భవిష్యత్ ను బీజేపీ ఎలా నాశనం చేసిందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2014 నుంచి మోదీ హయాంలో యువతలో నిరుద్యోగం మూడు రెట్లు ఎక్కువైందన్నారు.

Also Read: భారీగా నోట్ల కట్టలు, వాళ్లు బీజేపీ కార్యకర్తలా? నాలుగు కోట్లు సీజ్

మోదీ ప్రభుత్వం యువతకు తప్పుడు హామీలు ఇవ్వడం ద్వారానే దేశంలో నిరుద్యోగం ఇంతలా పెరిగిపోయిందని విమర్శించారు. ఇటీవలే వెల్లడైన భారత ఉద్యోగ నివేదిక ప్రకారం.. ఏటా 70-80 లక్షల మంది శ్రామిక శక్తిలో పాలు పంచుకుంటున్నారని వెల్లడైందన్నారు. 2012, 2019 మధ్య ఉద్యోగాల్లో వృద్ధి కేవలం 0.01 శాతంగా ఉందన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News