Nabha Natesh Latest Photos: “నన్ను దోచుకుందువటే” మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నభా నటేష్.
నభా నటేష్ 16 ఏళ్ల వయసులోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.
ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీల్లో పాల్గొని టాప్ 10 లో నిలిచింది. ఆ తర్వాత 2015లో కన్నడలో “వజ్రకాయ” సినిమాతో సినీరంగంప్రవేశం చేసింది.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ భామ గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయింది. ఈ మూవీతో మంచి గుర్తింపుపొందింది కూడా.
ఆ తర్వాత వరుసగా డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో తదితర సినిమాల్లో నటించింది.
మాస్ట్రో తరవాత నభా నటేష్ మళ్లీ తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ “స్వయంభూ” లో రాకుమారి సోఫీగా కనిపించనుంది.
నిఖిల్ సిద్ధార్ధ హీరోగా వస్తున్న ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరో కథానాయిక సంయుక్త. పాన్ ఇండియా చిత్రమిది.
ఇటీవలె చిత్రబృందం నభాకు వెలకమ్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
దీంతో ఈ బ్యూటీ అందాలు చూసి “ఎన్నాళ్లైంది నిన్ను తెరమీద చూసి”.. అని కామెంట్లవర్షం కురిపిస్తున్నారు.
2021 లో రోడ్ యాక్సెండ్ లో నభాకు గాయాలు కావడంతో ఇన్ని రోజులు సినిమాకు దూరంగా ఉంది. ఇప్పుడు పూర్తగా కోలుకొని వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం తరుచూ యాక్టివ్ గా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా వయ్యారాలు ఒలికిస్తూ దిగిన ఫొటోలు , వీడియోలు తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.