BigTV English

Mango Fruits Grows on Neem Tree: మంత్రి బంగ్లాలో విడ్డూరం.. వేప చెట్టుకు కాస్తున్న మామిడి పండ్లు..!

Mango Fruits Grows on Neem Tree: మంత్రి బంగ్లాలో విడ్డూరం.. వేప చెట్టుకు కాస్తున్న మామిడి పండ్లు..!

Mango Fruits Grows on Neem Tree in Minister Home: మధ్యప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. భోపాల్ లోని పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. ఈ విషయం మంత్రి వరకు వెళ్లింది. వెంటనే ఆయన అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని సంవత్సరాల క్రితం చేసి ఉండొచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.


ఈ బంగ్లా భోపాల్ లోని ప్రొఫేసర్ కాలనీకి సమీపంలో ఉంది. గతంలో ఈ బంగ్లా ముఖ్యమంత్రి నివాసంగా ఉండేది. ఈసారి ప్రహ్లాద్ పటేల్ కు కేటాయించారు. ఆ బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో మొక్కలు, చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ బంగ్లాలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనులను పరిశీలించడానికి మంత్రి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో వేప చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. వేప చెట్టుకు మామిడి కొమ్మ అంటుకుని ఉండి, దానికి మామిడి పండ్లు కాస్తుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయుర్వేద వైద్యుడు


ఆ తరువాత విషయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు చేరవేశారు. అక్కడికి చేరుకుని పరిశీలించిన శాస్త్రవేత్తలు మామిడి గింజలు పెద్ద చెట్ల నుండి పడిపోయినప్పుడు ఇలా అవి మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వింతగా ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×