Manipur CM : జాతుల మధ్య అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ ని(Governer) తన మంత్రి వర్గ సహచరులతో పాటుగా కలిసిన సీఎం.. తన రాజీనామాను (Resign) సమర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Anith Sha) ను కలిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. కాగా.. మణిపూర్ (Manipur) లో రెండు, మూడు రోజుల్లోనే నూతన సీఎం ను బీజేపీ (BJP Highcommand) అధిష్టానం ప్రకటించనుంది.
ప్రతి ఒక్క మణిపురీ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం సకాలంలో చర్యలు, అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులు పనులు జరగటానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బీరెన్ సింగ్.. ప్రకటించారు. వేల సంవత్సరాలలో గొప్ప, విభిన్న నాగరికత చరిత్ర కలిగిన మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. సరిహద్దు చొరబాట్లను అరికట్టడానికి, అక్రమ వలసదారుల బహిష్కరణకు విధానాన్ని రూపొందించడం మణిపూర్ కు చాలా అవసరమని.. బీరెన్ సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఇటీవల జరిగిన రాజకీయ అల్లర్లపైనా, ఇతర విషయాలపైనా మాట్లాడిన బీరెన్ సింగ్(Biren Singh).. డ్రగ్స్ (Drugs), నార్కో టెర్రరిజంపై పోరాటాన్ని కొనసాగించాల్సిన అవశ్యకత ఉందన్నారు.
హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్
మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామాపై కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేసింది. కానీ.. ఈ పని ఎప్పుడో జరగాల్సిందని వ్యాఖ్యానించింది. బీరెన్ సింగ్ రాజీనామా విషయం తెలిసిన తర్వాత ఎక్స్ (x) లో కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ స్పందించారు. మణిపూర్ సీఎం రాజీనామా చేసి బయటపడ్డారని, లేదంటే రేపు మణిపూర్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఆయన మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల్లో ఆయనపై, బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న జైరాం రమేష్.. అవిశ్వాస తీర్మానం విషయం తెలిసే.. సీఎం రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారంటూ తెలిపారు.
మణిపూర్ లో హింస చెలరేగుతున్నా ఇంతకాలం ఏమీ పట్టనట్టు వ్యవహరించడాన్ని కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుందని తెలిపారు. అల్లర్లు ప్రారంభమైన 2023 మే ప్రారంభం నుంచి కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ ఇదేనని అన్నారు. ఇప్పటికే.. సీఎం రాజీనామా ఇప్పటికే ఆలస్యమైందని అన్నారు. మణిపూర్ లోని బీజేపీ పాలనపై, సీఎం బీరెన్ స సింగ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read : మావోలకు మరో భారీ ఎదురుదెబ్బ – 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృత్యువాత
భారత్ ప్రధాని మోదీ (pm modi)… ఫ్రాన్స్, USA పర్యటనలపై విమర్శలు గుప్పించిన జైరాం రమేష్.. ఆయనపై విమర్శలు చేశారు. తరచూ విదేశాలకు వెళ్లేందుకు వీలున్న ప్రధానికి దేశంలోని మణిపూర్ ను సందర్శించేందుకు సమయం లేకుండా పోయిందంటూ ఆగ్రహించారు. గత ఇరవై నెలలుగా మణిపూర్‌కు వెళ్లడానికి వారికి సమయం లేదా.? ఆసక్తి లేదా.? అని ప్రశ్నించారు.