Palnadu News: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో..? స్థానికులను అడిగి తెలుసుకన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో గంగమ్మ, సామ్రాజ్యం, మాదవి, పద్మ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కుటుంబసభ్యుల మరణవార్త విని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బోరున విలపించారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. కుటుంబసభ్యుల మరణవార్త విని బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని ఒక్కసారిగా బోరును విలపించారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో.. చుట్టు పక్కల స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రమాద ఘటనపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మహిళా కూలీల మృతి బాధాకరమని మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు.